2107లో ఏకంగా ఆరు సూపర్ హిట్స్ తో సిక్సర్ కొట్టిన దిల్ రాజుకి 2018 మాత్రం ఎప్పటికీ మరచిపోలేని సంవత్సరంగా నిలిచిపోతుంది. అందుకు కారణం ఆయనకు ఖాతాలో చేరిన డిజాస్టర్లు, ఫ్లాపులు, లాసులు. నిర్మాతగా ఈ ఏడాది మూడు ఫ్లాపులు అందుకున్న దిల్ రాజుకి డిస్ట్రిబ్యూటర్ గానూ ఒక్క సరైన హిట్ కూడా లేదు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా భారీ నష్టాలు చవిచూశాడు దిల్ రాజు. ఒక నిర్మాతగా ఆయన చూసి ఎత్తుపల్లాల్లో ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన పల్లం కానప్పటికీ.. ఇలా వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడడం అనేది ఆయన కెరీర్ లో ఇదే మొదటిసారి కావచ్చు.
అయితే.. ఇప్పటివరకు ఒక నిర్మాతగా పోగొట్టుకున్నదానికంటే ఎక్కువ మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్ గా పోగొట్టుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. శంకర్ 2.0 చిత్రాన్ని అత్యధిక మొత్తానికి సొంతం చేసుకొన్న దిల్ రాజుకి నైజాంలో భారీ లాస్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. 2.0కి రివ్యూలు, పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. లాంగ్ వీకెండ్ లో కూడా హౌస్ ఫుల్స్ అవ్వలేదు. 3డి స్క్రీన్స్ వరకూ కాస్తంత హడావుడి జరుగుతున్నప్పటికీ.. సింగిల్ స్క్రీన్ మాత్రం ఖాళీగానే ఉంటున్నాయి. ఇప్పటివరకూ పెద్ద రికార్డ్ స్థాయి కలెక్షన్స్ కూడా నమోదవ్వలేదు. రజనీకాంత్ ఫ్లాప్ సినిమా కబాలి కలెక్షన్స్ ను కూడా ఇప్పటివరకు క్రాస్ చేయలేకపోయింది 2.0.
మరి ఈ భారీ నష్టం నుంచి దిల్ రాజు తన ప్లానింగ్ మరియు సొంత థియేటర్లను ఉపయోగించి తప్పించుకోగలుగుతాడా లేదా అందరు డిస్ట్రిబ్యూటర్స్ లాగే భారీస్థాయి లాస్ ను చవిచూస్తాడా అనేది తెలియాల్సి ఉంది. కకపోతే.. దిల్ రాజు లాంటి సీజనల్ ప్రొడ్యూసర్ ఇలా వరుస పరాజయాలతో, నష్టాలతో మదనపడుతుండడం మాత్రం బాధాకరం.