నట జీవితంలో ఎన్టీఆర్ కి ప్రాణం ఇచ్చే అభిమానులు, ఇక రాజకీయాల్తో ప్రజల గుండెల్లో గుడి కట్టించుకున్న మహోన్నత వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్ పై ఆయన కొడుకు బాలయ్య హీరోగా, నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ అంటూ కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు భాగాలుగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు.
అయితే కథానాయకుడిగా ఎన్టీఆర్ నట జీవితం, మహానాయకుడిగా ఎన్టీఆర్ రాజకీయాలు జీవితాలను ఈ బయోపిక్ లో చూపించబోతున్న విషయం తెలిసిందే. జనవరి 9 న సంక్రాంతికి, కథానాయకుడు జనవరి 24 న మహానాయకుడు సినిమాల విడుదలకు నిర్మాతలు డేట్ లాక్ చేశారు. అయితే విడుదల టార్గెట్ చాలా తక్కువ రోజుల్లోనే పెట్టుకున్నప్పటికీ.. దర్శకుడు క్రిష్ మాత్రం చాలా వేగంగా ఎన్టీఆర్ బయోపిక్ పనులను పూర్తి చేస్తున్నాడు. ఇక లుక్స్ తోనే అందరిని ఇంప్రెస్స్ చేసిన క్రిష్ ఇప్పుడు కథానాయకుడు సాంగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు.
ఎం. ఎం. కీరవాణి సంగీతమందిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఫస్ట్ సింగిల్ ని ఈ రోజు ఆదివారం ఉదయం విడుదల చేసింది చిత్ర బృందం. శివశక్తి దత్తా, రామకృష్ణ లిరిక్స్ అందించిన ఈ పాటను ప్రముఖ గాయకుడు కైలాస్ ఖేర్ ఆలపించారు. ఘనకీర్తి సాంద్ర విజితాఖిలాంద్ర జనతా సుధీంద్ర మణిదీపకా.. ఘనకీర్తి సాంద్ర విజితాఖిలాంద్ర జనతా సుధీంద్ర మణిదీపకా త్రిషతకాధికా చిత్రమాలికా.. అంటూ సాగే ఆ పాట అలనాటి మ్యూజిక్ ని ఈపాట జ్ఞప్తికి తెస్తుంది. మరి కీరవాణి సంగీతానికి గాయకుడు కైలాస్ ఖేర్ గొంతు తోడైతే... అద్భుతం అన్నట్టుగా ఉంది ఆ పాట. మరి ఆ పాటలో కథానాయకుడు మేకింగ్ లో క్రిష్ ఎంతగా ఆ సినిమా పనుల్లో లీనమైపోయాడో... క్రిష్ కి తోడుగా బాలయ్య కూడా ఎంతగా ఆ సినిమా కోసమా శ్రమిస్తున్నాడో... ఇక అలనాటి గుర్తులను పొల్లుపోకుండా చూపించాలనే క్రిష్ తాపత్రయం ఉంది చూసారు.. దానికి క్రిష్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.