Advertisement
Google Ads BL

'సుబ్రహ్మణ్యపురం'లో భళ్లాల దేవుడు!!


సుబ్రహ్మణ్యపురం మూవీలో హీరో రానా సందడి చేయబోతున్నాడు.అయితే ఇందులో ఆయన నటించడం లేదు..కాకపోతే రానా వాయిస్ సినిమా అంతా వినిపించబోతుంది.. ఈ సుబ్రహ్మణ్యపురం కథ ను నడిపించడం లో ఆ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ బలమైన పాత్ర ను పోషించనుందట.

Advertisement
CJ Advs

సుబ్రహ్మణ్యపురం కీలక సన్నివేశాలకు రానా వాయిస్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ రానాను సంప్రదించింది.దానికి ఆయన వెంటనే అంగీకారం తెలిపారు.

దర్శకుడు సంతోష్ జగర్లపూడి పర్యవేక్షణలో రానా కొన్ని కీలక సన్నివేశాలకు వాయిస్ నిచ్చారు. ఈ చిత్రం కాన్సెప్ట్ ని తెలుసుకొని ఎగ్జైట్ అయ్యారు. కంటెంట్ ఉన్న సినిమా లలో భాగం అయ్యే టాలీవుడ్ హల్క్ రానా కు సుబ్రహ్మణ్యపురం ట్రైలర్ కూడా బాగా నచ్చింది. సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్ పతాకం పై బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన సుబ్రహ్మణ్యపురం చిత్రం డిసెంబర్ 7న గ్రాండ్ గా విడుదలకు కాబోతుంది.

భగవంతుడి ఉనికి అనేది నమ్మకం అనే పునాదుల మీద ఉంటుంది. ఆ నమ్మకం లేని వ్యక్తి భగవంతుడిపై  చేసే పరిశోధనలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి. కాపాడవలసిన భగవంతుడి ఆగ్రహాం తట్టుకోవడం సాధ్యం అవుతుందా..? సుబ్రహ్మణ్యపురం లో దాగున్న రహాస్యం ఏంటి..?  ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన చిత్రం సుబ్రహ్మణ్యపురం. విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే  సుబ్రహ్మణ్యపురం ఇండస్ట్రీ లో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గా మారింది. ఇప్పటికే హిందీ శాటిలైట్, ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ లు పూర్తి అయ్యాయి. బాహుబలి, గరుడ వేగ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన టీం సుబ్రహ్మణ్యపురం కు వర్క్ చేసారు. లెజండరీ సింగర్ బాలసుబ్రహ్మణ్యం పాడిన థీమ్ సాంగ్ హైలెట్ గా నిలుస్తుంది. సెన్సిబుల్ హీరో సుమంత్, ఇషా రెబ్బ జంటగా నూతన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి రూపొందించిన ఈ మూవీ ఇండస్ట్రీ లోనూ, ప్రేక్షకులలో ఆసక్తి ని రేకెత్తించింది.

Rana Voice in 'Subrahmanyam':

Hero RANA Voice Over for SUBRAMANIAPURAM
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs