Advertisement
Google Ads BL

‘2.O’కి అక్కడ దెబ్బపడినట్లే..!!


గురువారం విడుదలైన 2.ఓ సినిమాకి ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ క్రిటిక్స్ నుండి 2.ఓ కి పాజిటివ్ అండ్ సూపర్ హిట్ మార్కులే పడ్డాయి. అయితే ఒక వెర్షన్ ప్రేక్షకులు 2.ఓ సినిమా సూపర్ హిట్.. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చెయ్యాలి, దర్శకుడు శంకర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అంటున్నారు. మరో వైపు ఇంకో రకం ప్రేక్షకులు ఈ సినిమా 3 డి లో చూస్తేనే బావుంటుంది. కానీ అందరికి 3డి అందుబాటులో ఉండదుగా... అలాగే క్లాస్ ఆడియన్స్ కి తప్ప మాస్ ఆడియన్స్ కి కాదు అని అంటున్నారు.

Advertisement
CJ Advs

మరి ఇండియా వైడ్ గా 2.ఓ మొదటి రోజు 70 కోట్లకు పైగా షేర్ రాబట్టిందని అంటున్నారు. ఇక దేశ విదేశాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే ఇతర స్టార్ హీరోలకు లేదు. కనీసం బాలీవుడ్ హీరోలకు కూడా రజినీకున్న ఫాలోయింగ్ విదేశాల్లో లేదు. మరి ఇక్కడ రజిని సినిమా యావరేజ్ పడినప్పటికీ.. ఓవర్సీస్ లో రజినీకాంత్ సినిమాల జోరు మాములుగా ఉండదు. మరి ఇక్కడ బాహుబలి రికార్డులను తుడిచేస్తుంది అన్నవారికి 2.ఓ సినిమా చూడగానే సమాధానం దొరికింది. కానీ ఓవర్సీస్ లో బాహుబలి తలదన్నే సినిమా 2.ఓ ఉంటుంది అనుకుంటే... అక్కడ 2.ఓ సందడి పెద్దగా కనిపించడం లేదు.

2.ఓ ప్రిమియర్లతో కలిపి ఓవర్సీస్ లో 1.4 మిలియన్ డాలర్ల  రాబట్టినట్లు గా వార్తలొస్తున్నాయి. మరి బాహుబలి ఫస్ట్ డే నే అంటే ప్రీమియర్స్ తో కలిపి 4 మిలియన్ మార్క్ దాటేసింది. మరి ఇదంతా చూస్తుంటే బాహుబలికి 2.ఓ సలాం కొట్టినట్లుగా లేదు. అందుకే ఓవర్సీస్ లో 2.ఓ సందడి కనబడ్డం లేదు అంటూ సోషల్ మీడియాలో బాహుబలి ఫ్యాన్స్ హంగామా షురూ చేశారు.

Baahubali Upper Hand Over 2.O:

2.O: No hungama at Overseas Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs