Advertisement
Google Ads BL

‘బాహుబలి’, ‘2.O’.. ఎవరిది విక్టరీ?


నిన్నటివరకు బాహుబలిని తలదన్నే సినిమా 2.ఓ అవుతుందా అంటూ అనేక అనుమానాలు సోషల్ మీడియాలో ప్రచారం అయ్యాయి. బాహుబలిని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన చాలా సినిమాలు నామ రూపాల్లేకుండా కొట్టుకుపోయాయి.. కానీ సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ మాత్రం తన 2.ఓ తో బాహుబలిని తలదన్నే సినిమా చేశాడంటూ ప్రచారం జోరుగా జరిగింది. ఇక 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన 2.ఓ సినిమా మీద భారీగా అంచనాలే ఉన్నాయి. మరి గురువారం వరల్డ్ వైడ్ గా విడుదలైన 2.ఓ ప్రేక్షకుల నుండి క్రిటిక్స్ నుండి పాజిటివ్ మార్కులేయించుకుంది. ఇక రాజమౌళి బాహుబలి సినిమాని ఎవరెస్టు శిఖరమెక్కించాడు. మంచి కథతో.... కథకు తగిన గ్రాఫిక్స్ తో సినిమాని ఉన్నత శిఖరాలను తాకించాడు.

Advertisement
CJ Advs

మరి ఎప్పుడూ మంచి కథతో మెస్సేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేసే శంకర్ ఈ సారి కూడా మెసేజ్‌ని అయితే మరువలేదు కానీ... 2.ఓ లో కథను, కథనాన్ని లైట్ తీసుకున్నాడు శంకర్. కథ, కథనంతో 2.ఓ సినిమా చూస్తే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని పర్వాలేదనిపిస్తే, కథను పక్కనబెడితే శంకర్ తెరకెక్కించిన 2.ఓ విజువల్ వండర్ అని చెప్పాలి. టెక్నిక‌ల్‌గా ఉన్న‌తంగా ఉంది 2.ఓ. మ‌రీ ముఖ్యంగా విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ ని అంత‌ర్జాతీయ నిపుణుల‌తో రూపొందించ‌డం వ‌ల్ల‌... నిర్మాతలు భారీ స్థాయిలో  ఖ‌ర్చు పెట్ట‌డం వ‌ల్ల సినిమాకి కావాల్సిన నిండుతనం వచ్చింది. సినిమా చూస్తున్నంతసేపు 2.ఓ కథను సాంకేతిక‌త మింగేసింద‌నిపిస్తుంది. 

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి కథ, సాంకేతికత కలిపి అర్ధవంతమైన హిట్ కొడితే.. శంకర్ తెరకెక్కించిన 2.ఓ హాలీవుడ్ రేంజ్ లో హై స్టాండర్డ్స్ తో వున్న విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుడిని ఎక్కడా బోర్ కొట్టించకుండా కట్టిపడేస్తాయి. అయితే శంకర్ ట్రైల‌ర్లో చెప్పిన క‌థే… వెండి తెర‌పైనా క‌నిపించింది. ఓ ర‌కంగా.. ప్రేక్ష‌కుల్ని క‌థ విష‌యంలో దర్శకుడు శంకర్ ముందే ప్రిపేర్ చేసేశాడు. ఇక విజువ‌ల్‌గా త‌న గ్రాండియ‌ర్ ని చూపించ‌డ‌మే త‌రువాయి అన్నట్లుగా ఉంది 2.ఓ సినిమా మొత్తం. ఇక గ్రాఫిక్స్ కి పెద్ద పీట వేసిన శంకర్.. ర‌జినీకాంత్ - అక్ష‌య్‌ కుమార్ ల మ‌ధ్య స‌న్నివేశాల్నే హైలెట్ చేశాడు. కాకపోతే ఈ 2.ఓ లో కావాల్సిన ఎమోషన్స్, కామెడీ, రొమాన్స్ అన్ని మిస్ అయ్యాయి. అదే బాహుబలిలో విజువల్ వండర్ గా ఎమోషన్స్, కామెడీ, రొమాన్స్ అన్నింటిని రాజమౌళి సమపాళ్ళలోనే చూపించగలిగాడు. 

రాజమౌళి బాహుబలిని  గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో, ఎమోష‌న్స్‌ని పీక్స్‌లోకి తీసుకెళ్ళి, లిమిటెడ్ గ్రాఫిక్స్‌ తో అదుర్స్ అనిపిస్తే... కథను పక్కకి పెట్టి విజువల్స్ ఎఫెక్ట్స్ తోనే దర్శకుడి శంకర్ అదరగొట్టేసాడు. మరి నెంబర్ వన్ డైరెక్టర్స్ రేస్ లో ఉన్న రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, శంకర్ తెరకెక్కించిన 2.ఓ సినిమాల్లో ఏది గెలిచిందో అనేది ప్రేక్షకుడు చెబితేనే బావుంటుంది.

Rajamouli, Shankar.. Who is the Real Winner?:

2.O Or Baahubali.. what is best in this?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs