అరవింద్ రెడ్డి, శుభంగి పంత్, అజిత్ రాధారాం, దీక్షిత హీరోహీరోయిన్లుగా తీర్థసాయి ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న మూవీ ‘‘నీ కోసం’’. రీ ఫ్రెషింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీతో అవినాష్ కోకటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అల్లూరమ్మ (భారతి) నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సోమశేఖర రెడ్డి, అల్లూరి రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రేమలోని భిన్నమైన కోణాలను స్పృశిస్తూ రూపొందుతున్న ఈ సినిమా టీజర్ రిలీజైంది. టాకీ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఈ సందర్భంగా దర్శకుడు అవినాష్ కోకటి మాట్లాడుతూ.. ‘‘మా ‘నీ కోసం’ మూవీ ఈ మధ్య వస్తున్న ప్రేమకథలకు భిన్నంగా ఉంటుంది. రెండు ప్రేమజంటల కథలను ఇందులో డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తున్నాం. న్యూ ఏజ్ లవ్ స్టోరి అని చెప్పొచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ ను మిస్ అవ్వకుండానే ప్రేమలోని సున్నితమైన ఎమోషన్స్ ను టచ్ చేస్తున్నాం. ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న మా మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’.. అన్నారు.