Advertisement
Google Ads BL

ఐటం కష్టాల్లో.. చరణ్, బోయపాటి ఫిల్మ్..!!


రామ్ చరణ్ - బోయపాటి కాంబినేషన్ లో సంక్రాంతికి రెడీ అవుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ చేసుకుంది. ఒక్క ఐటెం సాంగ్ బ్యాలెన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈసినిమా సెన్సార్ కి కూడా రెడీ అవుతున్నట్టు సమాచారం. అయితే ఈ ఐటెం సాంగ్ కు ఏ హీరోయిన్ దొరక్క తెగ ఇబ్బంది పడుతున్నాడట బోయపాటి.

Advertisement
CJ Advs

గత కొన్ని రోజులు నుండి సాంగ్ కోసం ఇలియానాను తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఈ సాంగ్ చేసేందుకు 60 లక్షలు డిమాండ్ చేయడంతో డ్రాప్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని టీమ్ తెలిపింది. ఇలియానా చరణ్ పక్కన సూట్ అవ్వదని.. ఆమె చరణ్ పక్కన అక్కలా ఉంటుందని అందుకే ఆమెను తీసుకోలేదని తెలుస్తుంది.

రకుల్ లేదా రాశి చరణ్ తో స్టెప్స్ వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియదు. తమన్నాను ట్రై చేద్దామా అంటే కాల్ షీట్ సమస్య ఉందని తెలిపినట్లుగా చెబుతున్నారు. కాజల్ కూడా వరస సినిమాలతో బిజీగా ఉంది. అలా ఈ ఐటంకు భామను పట్టడం బోయపాటికి పెద్ద ఛాలెంజ్ గా మారింది. విడుదల తేదీ దగ్గరకు వస్తుంది. రామ్ చరణ్ ఏమో రాజమౌళి సినిమాలో బిజీగా ఉన్నాడు. మరి బోయపాటి ఎవరిని సెట్ చేసి చరణ్ తో స్టెప్స్ వేయిస్తాడో చూడాలి.

Vinaya Vidheya Rama Talkie part Completed:

Vinaya Vidheya Rama Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs