Advertisement
Google Ads BL

RRR: మరో స్టోరీ వచ్చేసింది..!


రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న #RRR నుండి రోజుకొక న్యూస్ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ - ఎన్టీఆర్ నటిస్తున్న ఈసినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ వారు కూడా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా పది రోజులు కూడా కాకముందే ఈసినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని సమాచారం. అయితే రాజమౌళి మాత్రం ఇప్పుడే వద్దని రెండు మూడు నెలలు పోయిన తరువాత మంచి రోజు చూసుకుని అప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పాడట.

Advertisement
CJ Advs

ఈసినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఈ సినిమా స్టోరీ ఏమైవుంటది అని..చరణ్ - తారక్ ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అని అందరిలోనూ ఆసక్తి నెలకుంది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో తారక్ బందిపోటు దొంగగా.. చరణ్ పాత్ర అతన్ని పట్టుకోవడానికి నియమింపబడ్డ పోలీస్ ఆఫీసర్‌గా ఉంటుందని తెలిసింది. ఇండియాకు స్వాతంత్ర్యం రాకముందు 1920నాటి కాలంలో జరిగే కథగా చూపించనున్నాడు జక్కన్న. ఎన్టీఆర్ లుక్ ఇందులో చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ - ఎన్టీఆర్ ల మధ్య హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

ఇద్దరు దేశ భక్తి మెండుగా ఉంటూనే బానిస సంకెళ్ళ నుంచి దేశానికి విముక్తి కలిగించడం ట్రై చేస్తూ ఉంటారు. ఒక టైములో ఇద్దరు ఒక్కటై బ్రిటిష్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు జెండా ఎగురవేయడం సినిమాలోని మెయిన్ థీమ్ అని టాక్. ఇది రీసెంట్‌గా వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ కథకు చాలా దగ్గరగా ఉంది. మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ నిజమే అనే ప్రచారం అయితే జరుగుతుంది. రామ్ చరణ్ - ఎన్టీఆర్ తప్ప ఇతర నటీనటులను ఇంకా ఎంపిక చేయలేదు రాజమౌళి. 2020 సమ్మర్‌లో ఈ సినిమా విడుదలకానుంది.

Disaster Movie Shades In RRR, But:

RRR Has Shades Of Thugs Of Hindostan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs