Advertisement

2.O.. ఎందుకీ పబ్లిసిటీ స్టంట్..??


‘బాహుబలి’ సినిమాతో ఇండియా వైడ్ అందరూ తనవైపు చూసేలా చేసాడు రాజమౌళి. ‘బాహుబలి’ కొల్లగోట్టిన కలెక్షన్స్‌తో అన్ని వుడ్స్ తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకున్నారు. కోలీవుడ్ లో జనాలకైతే ఈ సినిమా ఎంజాయ్ చేస్తూనే అసూయ చెందారు. అక్కడ బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా ఈ సినిమాకు బాగా వచ్చాయి. దాంతో అక్కడ డైరెక్టర్స్ కి ఈసినిమా సవాలుగా మారింది. అక్కడ శంకర్ ఒక్కడే జాతీయ స్థాయిలో సినిమాను తీయగలడు. అందుకే కోలీవుడ్ జనాల కళ్ళు ‘రోబో’ సీక్వెల్ ‘2.0’ మీద పడ్డాయి.

Advertisement

ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు ఎక్కడాలేని హైప్ తేవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళనాట ఈసినిమాకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మరీ అతిగా అనిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఈసినిమాకు రూ.120 కోట్లు వచ్చాయని అక్కడి క్రిటిక్ రమేష్ బాల ఒక ట్వీట్ చేశాడు. ఇది నమ్మశక్యంగా అనిపించడం లేదు. తమిళనాడులో థియేటర్స్ కౌంట్ మన ఆంధ్రా‌లో ఉన్న థియేటర్స్‌తో పోలిస్తే సగం కూడా లేవు.

‘సర్కార్’ సినిమా తమిళం లో కన్నా తెలుగునే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయిందంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఎంత భారీ సినిమా అయినా 700 థియేటర్స్ కి మించి చేయరు. అలాంటిది ఈసినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఇంత ఎలా వచ్చిందంటే ఎవరికి అర్ధం కానీ విషయం. మరీ నిజంగా అంత బుకింగ్స్ జరిగాయా? అంటే కాదు అనే చెబుతున్నారు ట్రేడ్ నిపుణులు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటున్నారు.

Doubts on 2.O Advance Bookings:

Too Much publicity for 2.O
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement