Advertisement
Google Ads BL

తన భర్తకి జోడీని చూసిన సమంత..!


తెలుగులో ప్రస్తుతం హాట్‌ కపుల్‌ ఎవరు అంటే అక్కినేని నాగచైతన్య-సమంత అనే చెప్పాలి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రంతోనే ప్రేమలో పడిపోయిన ఈ జంట ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాలలో కలిసి నటించారు. అయితే వివాహం జరిగిన తర్వాత మాత్రం వీరిద్దరు కలిసి నటించలేదు. ఇప్పుడు వీరు ఇదే ప్రయత్నం చేస్తున్నారు. ‘నిన్నుకోరి’ ఫేమ్‌ శివనిర్వాణ దర్శకత్వంలో వీరిద్దరు నటిస్తున్న చిత్రం ‘మజిలి’. అయితే ‘మజిలి’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉందే గానీ ఇంకా దీనిపై యూనిట్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అవునని గానీ కాదని గానీ చెప్పలేదు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని తాజాగా నాగచైతన్య బర్త్‌డే కానుకగా విడుదల చేశారు. ఇందులో వెస్పా స్కూటర్‌పై కాస్త గడ్డం ఎక్కువగా పెంచుకుని, మధ్యతరగతి యువకుని గెటప్‌లో చైతూ కనిపిస్తున్నాడు. 

Advertisement
CJ Advs

గత నెల చైతూ-సామ్‌ల మొదటి వివాహ సంబరాలు ముగిసిన వెంటనే వీరిద్దరు షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. కానీ అప్పటికే శివనిర్వాణ వీరిద్దరు లేని పలు ఇతర సీన్స్‌ని తీశాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ వైజాగ్‌, సింహాచలంలో జరిగింది. యూనిట్‌ హైదరాబాద్‌కి చేరుకుంది. ఇంత తక్కువ వ్యవధిలోనే ఈ మూవీ షూటింగ్‌ 40శాతం పైగా పూర్తయిందని తెలుస్తోంది. ఇక ఇందులో నాగచైతన్యతో పాటు సమంత మాత్రమే హీరోయిన్‌గా నటిస్తోందని పలువురు భావించారు. కానీ ఇందులో మరో హీరోయిన్‌కి కూడా స్థానం ఉందిట. ఈ పాత్రకి ముంబైకి చెందిన మోడల్‌ దివ్యాంష కౌశిక్‌ని ఫైనల్‌ చేశారు. కానీ ఈమెని ఫైనల్‌ చేసింది దర్శకుడు శివానిర్వాణనో లేక హీరో నాగచైతన్యనో కాదు. 

స్వయంగా ఇందులో తన భర్త పక్కన నటిస్తున్న సమంత తన భర్తకి తగ్గ మరోజోడీగా ఈమెని ఎంపిక చేసిందట. ఆమె ఫొటోలు, ఆడిషన్స్‌ టేప్‌లు చూసిన తర్వాత ఎంతో నచ్చి మరీ సమంత ఆమెని ఫైనల్‌ చేసిందని టాక్. ఈనెల 26 నుంచి హైదరాబాద్‌లో ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఇందులో కొత్త హీరోయిన్‌ ఎంటర్‌ అవుతుంది. సెకండ్‌ హీరోయిన్‌ అంటే కేవలం పాటలకు, గ్లామర్‌కి, ఇలా వచ్చి అలా వెళ్లే పాత్ర కాదని, ఈ చిత్రం మొదటి పార్ట్‌ మొత్తం చైతు-దివ్యాంష కౌశిక్‌ల మద్యనే తిరుగుతుందని, ఇది ఈ ముంబై మోడల్‌ టాలెంట్‌కి పెద్ద పరీక్షేనని తెలుస్తోంది. మరి ఈమె వెండితెరపై ఏ విధంగా మెప్పిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Second Heroine in Samantha and Naga Chaitanya Combo movie:

Samantha Selected Second Heroine for Majili movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs