కుమారి 21 ఎఫ్ తో హాట్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన హెబ్బా పటేల్, రాజ్ తరుణ్ తో కలిసి నటించిన సినిమాలు పర్వాలేదనిపించినా.. రాజ్ తరుణ్ స్నేహం వదిలిన తర్వాత మాత్రం హిట్ అనే పదమే హెబ్బా దరి చేరలేదు. ఇక కుమారి హెబ్బా మాత్రమే కాదు రాజ్ తరుణ్ కి కూడా హిట్స్ కరువయ్యాయి. ఇక ఏంజెల్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న హెబ్బా పటేల్ ఇప్పుడు 24 కిస్సెస్ అనే బోల్డ్ సినిమాలో నటించింది. మరి 24 కిస్సెస్ టైటిల్ లోనే బోలెడంత హాట్ అండ్ స్పైసి కాంట్రవర్సీ ఉంది. అయితే సినిమా విడుదలకు ముందు 24 కిస్సెస్ సినిమాపై భారీ ప్రమోషన్స్ చేసింది హెబ్బా పటేల్ అండ్ మూవీ టీం. అయితే టైటిల్ లోనే కాస్త బోల్డ్ తనం నిండిన ఈ సినిమాని చూడడానికి కేవలం అంటే కేవలం యూత్ మాత్రమే ముందుకొస్తారు. అదే సినిమా హిట్ అయినా మళ్ళీ వారు తప్ప ఆ సినిమా చూడడానికి ఎవరు ముందుకు రారు. మరి అలాంటి టైటిల్ తోనే నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన హెబ్బాకి 24 కిస్సెస్ ఎలాంటి ఫలితమిచ్చిందో మీరే చూడండి.
హెబ్బా పటేల్ అయితే మంచి ఈజ్ తో ఈ సినిమాలో నటించింది. రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషన్స్ ని కూడా బాగానే పలికించింది. అరుణ్ అదిత్, హెబ్బా తమ నటనతో ఆకట్టుకున్నారు. అరుణ్ అదిత్, హెబ్బా మధ్య మంచి కెమిస్ట్రీనే పండింది. కానీ సినిమా కథలో బలం లేకపోవడం... జోయ్ బారువా సంగీతం యావరేజ్ గానే ఉండడం.... ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. కాకపోతే ఉదయ్ గరుల్లా సినిమాటోగ్రఫీ కొంతలో కొంత సినిమాని నిలబెట్టింది. సినిమా స్క్రీన్ ప్లే కానీ, నేరేషన్ కానీ ఏమి ఆకట్టుకోలేకపోయాయి. అలాగే సినిమాలో భూతద్దం పెట్టి వెతికినా కామెడీ లేకపోవడం, అలాగే సినిమా నిడివి కూడా చికాకు తెప్పిస్తుంది. అసలు ఎడిటింగ్ చెయ్యడం మరిచిపోయారా అనే ఫీలింగ్ అయితే తెప్పిస్తుంది.
మరి హెబ్బా నటన, అందం, హాట్ యాంగిల్స్ అన్ని చక్కగా ఉన్నప్పటికీ.. సినిమా కథలో బలం లేకపోవడంతో అలాగే చాలా మైనస్ లు ఉన్న కారణంగా ఈ సినిమా కూడా డిజాస్టర్స్ లిస్ట్ లోకెళ్ళిపోయింది. ఇక సినిమా డిజాస్టర్ అవడంతో హెబ్బా నటన, లుక్స్ బావున్నప్పటికీ..... ఆమెకు క్రేజ్ రాదు గనక... హెబ్బాకి ఇక టాలీవుడ్ అవకాశాలు వస్తాయంటే డౌట్ పడాల్సిందే. మరి ఎక్కువ గ్లామర్ ఒలకబోసినా పరిస్థితి ఎలా ఉంటుందో అనేది హెబ్బాతో అర్ధమవుతుంది. ఏదిఏమైనా హెబ్బా మాత్రం అందరిని అంటే ప్రేక్షకులను 24 కిస్సెస్ తో అబ్బా అనిపించింది.