ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ నుండి ఏడాదికి మూడు నుండి నాలుగు సినిమాలు వస్తుంటాయి. వన్స్ దిల్ రాజు కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇస్తే అక్కడే ఉండిపోవచ్చు. చిన్న రైటర్స్ నుండి పెద్ద డైరెక్టర్స్ వరకు అందరితో సన్నిహితంగా ఉండే దిల్ రాజు దగ్గర పని చేసిన వాళ్లలో ఎవరిని అంత త్వరగా వెళ్లిపొమ్మనడు. రైటర్స్ అయినా.. డైరెక్టర్స్ అయినా దిల్ రాజు కంటిలో పడితే వారికి పారితోషికాలు ఇచ్చి మరీ కుర్చోపెడతాడు.
తన బ్యానర్ లో ఫ్లాప్‌లు ఇచ్చిన డైరెక్టర్స్ కి సైతం కూడా నెల జీతాలిచ్చి మరీ తన దగ్గరే పెట్టుకుంటాడు. అయితే అంత ఫ్రీడమ్ ఇచ్చే దిల్ రాజు.. త్రినాధరావు-ప్రసన్నకుమార్‌ని బయటికి పంపేశాడట. దిల్ రాజు బ్యానర్ లో ‘నేను లోకల్’ లాంటి పెద్ద హిట్ ఇచ్చి ‘హలో గురు ప్రేమకోసమే’ లాంటి యావరేజ్ మూవీ ఇచ్చారు దర్శక-రచయిత ద్వయం త్రినాధరావు-ప్రసన్నకుమార్.
అయితే ఈ ఇద్దరు దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా కోసం రెడీ అవుతున్నారు. నెక్స్ట్ మూవీ కోసం భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో దిల్ రాజు ఇక్కడ కుదరదులే కానీ బయట ట్రై చేసుకోండి అని చెప్పాడట. దానికి తోడు వీరి దగ్గర ఫ్రెష్ థాట్స్ కూడా లేకపోవడంతో దిల్ రాజు తన పట్టు సడలించి వారిని పంపేశాడట. వెంకటేష్ కోసం రెడీ చేసుకున్న సబ్జెక్టు సురేష్ బాబు కి వినిపిస్తే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే రెమ్యూనరేషన్ విషయంలో సురేష్ బాబు మరీ గీసి గీసి బేరాలాడతాడు అని పేరు ఉంది. మరి ఈ జంటకు అనుకున్నట్టు అక్కడ భారీ రెమ్యూనరేషన్ లభిస్తుందేమో చూడాలి.