Advertisement
Google Ads BL

పెళ్లయ్యాక ఇదేం పని నమిత..??


తమిళతంబీలు ఇడ్లీ, సాంబార్‌, పొంగల్‌ని ఎంతగా ఇష్టపడతారో.. వెండితెరపై మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో బొద్దందాలను అంతగా ఆదరిస్తారు. తెరనిండా నిండుగా కనిపించే బొద్దందాలు చూస్తే గానీ వారికి ఐఫీస్ట్‌లా, సాంబార్‌, ఇడ్లీ, పొంగల్‌ తిన్నంత ఆనందంగా ఉండదు. తెరనిండా పరుచుకునే అందాలకు వారు దాసోహం అంటారు. నాటి జయలలిత నుంచి ఖుష్బూ, నమిత, హన్సిక వరకు వారి టేస్ట్‌ ఇదే. ఏదో కాస్త నయనతారకి మాత్రం మినహాయింపు ఇచ్చారు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే గతకొంతకాలం కిందట తమిళ నాట అందాల దేవతగా గుళ్లు, గోపురాళ్లు, పూజలు అందుకున్న హీరోయిన్‌ నమిత. తెలుగులో ఈమె మొదట్లో నటించిన చిత్రాలలో పెద్దగా బొద్దుగా లేకపోయినా తమిళనాటకి వెళ్లిన తర్వాత మాత్రం వారి టేస్ట్‌కి అనుగుణంగా బాగా లావెక్కింది. ఇక ఈమె ఇటీవలే వివాహం కూడా చేసుకుంది. వివాహం తర్వాత ఆమె మరింతగా బరువు పెరిగి, మరింత లావెక్కింది. మరీ అత్త, అమ్మ, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ తరహాలో మరీ ఓవర్‌గా బరువు పెరగడం, పెళ్లి కూడా కావడంతో ఈమెకి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. నయనతారతోపాటు కొత్త హీరోయిన్ల పోటీని ఈమె తట్టుకోలేకపోయింది దాంతో పెళ్లి సాకుతో ఆమె కొంత కాలం వెండితెరకు దూరంగా వెళ్లింది. అలాంటి నమిత మరలా సినిమాలలో నటించాలనే ఉద్దేశ్యంతో బరువు తగ్గడంపై దృష్టి సారించింది. ఈ విషయంలో గట్టిగా కసరత్తులు చేస్తూ కాస్త బరువు తగ్గిందట. 

అలా కాస్త సన్నబడిన నమితను త్వరలో విడుదల కానున్న ‘అహంభావం’ చిత్రంలో చూడవచ్చు. ఆమె ప్రధానపాత్రగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి శ్రీమహేష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఆమె గ్లామర్‌ పాత్రలో కాకుండా ఎంతో నటనావకాశం ఉన్న పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. మరి ఇంతకాలం బొద్దందాల గ్లామర్‌తో మెప్పించిన నమిత కొత్త మేకోవర్‌లో నటనా ప్రాధాన్యం ఉన్న పాత్రలో ఏ మేరకు మెప్పిస్తుందో వేచిచూడాల్సివుంది...!

Namitha Re Entry Film Confirmed:

Namitha Goes Slim for Ahambhavam Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs