Advertisement
Google Ads BL

గంటపాటు ‘సైరా’ డైరెక్టర్ మారాడు..!


రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘సైరా’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిరంజీవి లీడ్ రోల్ లో నటిస్తున్న ఈసినిమాలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. దాంతో ఈసినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా ఫిలింనగర్ సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా కోసం ఒక గంట‌ డైరెక్ట‌ర్ అవ‌తారం ఎత్తాడని తెలుస్తుంది.

Advertisement
CJ Advs

అది కూడా ‘సైరా’ కోసం అంట. సురేంద్ర రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఒక రోజు సురేంద్ర రెడ్డి సెట్స్ కి ఒక గంట లేట్ గా వచ్చాడట. దాంతో చిరు అప్పటికే సెట్స్ లో ఉండటంతో ఆ రోజు తీయాల్సిన సన్నివేశం చదివి ఆ సన్నివేశంను డైరెక్ట్ చేసాడట. సురేంద్ర రెడ్డి వచ్చేప్పటికి చిరు కెప్టెన్ చైర్ లో కూర్చుని డైరెక్ట్ చేయడం చూసి డిస్ట్ర‌బ్ చేయ‌డం ఇష్టం లేక‌, షాట్ అయ్యేంత వ‌ర‌కూ సురేంద్ర రెడ్డి ఆ ప‌క్క‌నే నిల‌బ‌డి చూశాడ‌ని స‌మాచారం అందుతోంది.

అయితే చిరు ఇలా డైరెక్ట్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సినిమాలు ఇలానే డైరెక్ట్ చేశాడు. ‘గ్యాంగ్ లీడ‌ర్‌’లో కొన్ని స‌న్నివేశాల్ని కూడా చిరు ఇలానే డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు మరోసారి డైరెక్టర్ అవతారం ఎత్తాడు. చిరు 151వ చిత్రంగా రూపొందుతున్న ఈచిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కానుంది.

Sye Raa Director Changed:

Chiranjeevi Directed 1hr Shoot for Sye Raa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs