Advertisement
Google Ads BL

‘మీటూ’: అతడ్ని మాత్రం వదలనంటోంది..!


దక్షిణాది చిత్ర రంగంలో యాక్షన్‌ కింగ్‌గా పేరు తెచ్చుకున్న నటుడు అర్జున్‌. ఇటీవల మీటూ ఉద్యమంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కన్నడ నటి శృతిహరిహరన్‌ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. ‘నిపుణన్‌’ చిత్రం షూటింగ్‌ సమయంలో అర్జున్‌ తనని లైంగికంగా వేధించాడని ఈమె బహిరంగంగా వెల్లడించింది. ఈ వార్తలు సంచలనం సృష్టించడంతోపాటు జెంటిల్‌మేన్‌గా గుర్తింపు పొందిన అర్జున్‌ ఇమేజ్‌ని డామేజ్‌ చేశాయి. అయితే శృతిహరిహరన్‌ ఆరోపణల్లో నిజం లేదని, ఇవన్నీ తనని కావాలని టార్గెట్‌ చేసినవని చెప్పి అర్జున్‌ పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయడం, నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌పై కోర్టుకి వెళ్లడం జరిగింది. అలాగే శృతి కూడా అర్జున్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

Advertisement
CJ Advs

దీంతో ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు కొందరు కన్నడ సినీ పెద్దలు ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయిందని ప్రచారం జరుగుతోంది. అర్జున్‌తో రాజీకి శృతిహరిహరన్‌ ససేమిరా అంటోందిట. అందుకే శృతికేసులో తనని ఎక్కడ అరెస్ట్‌ చేస్తారో అనే భయంతోనే అర్జున్‌ కోర్టుకి వెళ్లి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నాడని అంటున్నారు. అయినా అర్జున్‌ని వదిలేది లేదని శృతి స్పష్టం చేసింది. బెంగుళూరులోని మహిళా కమిషన్‌ ముందుకు వెళ్లి తనకి న్యాయం చేయాలని కోరుతూ ఆయనపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె కోరడంతో ఈ వివాదం ఇప్పటితో ముగిసే అవకాశాలు మృగ్యం అయిపోయాయి. 

తాజాగా శృతి తాను అర్జున్‌పై చేసిన ఆరోపణలన్నింటికీ తన వద్ద గట్టి ఆధారాలు ఉన్నాయని మరోసారి స్పష్టం చేసింది. ఆయనపై ఫిర్యాదు చేసినందుకే అతను నా మీద కేసు వేశాడని వాదించింది. ఆ కేసును ఎదుర్కోవడానికి నేను సిద్దంగా ఉన్నాను. అలాగే నేను చేసిన ఆరోపణలకు సంబంధించిన  ఆధారాలను కోర్టులోనే సమర్పిస్తాను. అదేవిధంగా అర్జున్‌ మద్దతుదారులు నన్ను బెదిరిస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే అర్జున్.. తను చేసిన పనికి భయపడుతున్నట్లు అర్ధమవుతోంది. ఏది ఏమైనా అర్జున్‌ని వదిలే ప్రశ్నే లేదని తేల్చిచెప్పింది. చూద్దాం.. చివరకు ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో...?

Shruti Hariharan Strong Comments on Arjun Sarja:

MeToo: Sruthi Hariharan accuses Arjun Sarja of harassment
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs