టాలీవుడ్‌లో ఒకప్పుడు అన్న అంటే ఎన్టీఆర్.. ఆ తర్వాత అన్నయ్య అంటే చిరంజీవి. ప్రస్తుతం మాత్రం అన్నయ్య అంటే పవన్‌కళ్యాణ్.. వదినమ్మ అంటే రేణుదేశాయ్. పవన్-రేణుదేశాయ్‌లు విడాకులు తీసుకుని విడిపోయినా కూడా అభిమానులు రేణుని వదినమ్మగానే భావిస్తూ ఉంటారు. ఇక రేణుదేశాయ్ కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను, కెరీర్‌ని, పిల్లలను, తన మనోభావాలను, కవితలను చెబుతూ ఉంటుంది.
తాజాగా ఈమె మరోసారి సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చింది. దాంతో అసంఖ్యాకమైన పవన్, రేణుదేశాయ్‌ల ఫాలోవర్స్ ఆమెని అకిరా, ఆద్య ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మరికొందరు రెండో వివాహం ఎప్పుడు అంటూ ప్రశ్నించారు. వాటికి సమాధానం తర్వాత చెబుతానని, ప్రస్తుతానికి తనను ఈ రెండు విషయాలు అడగవద్దని ఆమె తేల్చిచెప్పింది. అంతేకాదు.. తాను రాసిన కవితా సంకలనం పుస్తకాన్ని వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ పుస్తకంలో నేను రాసిన 31 కవితలు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఈ కవితలు వెలువడుతాయి. ఇందులోని 15 కవితలను తెలుగులోకి పాటల రచయిత అనంత శ్రీరాం అనువాదం చేశారు... అని ఆమె తెలిపింది.
అదే సమయంలో ఆమె ‘రకరకాల జ్ఞాపకాల’ అనే కవితను చదివి వినిపించింది. ఈ కవితలను గత డిసెంబర్‌లో రాశానని, ఈ డిసెంబర్‌లో అనంత శ్రీరాం సహకారంతో పుస్తకరూపం ఇస్తున్నాను. ఈ పుస్తకం కోసం ప్రీఆర్డర్ చేస్తే దానిపై నేను సంతకం చేసి పంపుతాను అని చెబుతూ, సోషల్ మీడియాలో కొందరు తమ సొంత పేర్లకు బదులు హీరో హీరోయిన్ల పేర్లు పెట్టుకుంటున్నారని, తల్లిదండ్రులు పెట్టిన పేర్లను వదిలి ఇలా పెట్టుకోవడం ఎందుకు? ఎవరికోసం? అని ఆమె సూటిగా ప్రశ్నించింది. నిజమే.. రేణు చెప్పిన మాట అక్షరసత్యమనే చెప్పాలి.