తెలుగులో నటునిగా, రచయితగా, దర్శకునిగా కూడా బి.వి.యస్.రవికి మంచి గుర్తింపు ఉంది. ఈయన ‘వాంటెడ్, జవాన్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. నటునిగా ‘ఖైదీనెంబర్1, ఖైడీబ్రదర్స్, అయోధ్య, శ్రావణమాసం’ వంటి చిత్రాలు చేశాడు. ఇక రచయితగా ఆయన 15 ఏళ్లుగా రాణిస్తున్నాడు.
ఇక ఈయనను బి.వి.ఎస్.ఎన్.రవితో పాటు మచ్చరవి అని కూడా పిలుస్తారు. ఆయన పనిచేసిన ఎన్నో చిత్రాలు విజయవంతం అయ్యాయి. కాగా రవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ, మొదటి నుంచి కూడా నేను చిరంజీవి గారి వీరాభిమానిని. ఆయన సినిమాలే ఎక్కువగా చూసేవాడిని. ఆయన సినిమాల్లోని పాటలు నాకు నోటికి వచ్చేసేవి. అంతగా చిరంజీవిని అభిమానించే వాడిని.
అలాంటి నేను ఏడాదిన్నర పాటు కష్టపడి, చిరంజీవి గారి 150వ చిత్రానికి ఓ కథ తయారు చేశాను. చిరంజీవి గారికి 99శాతం ఈ కథ బాగా నచ్చింది. ఒక్క శాతం దగ్గరే కథ ఆగిపోయింది. అయినా నాకు బాధ అనిపించలేదు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడే ఎలాగైనా చిరంజీవి గారికి కథ చెప్పాలని వచ్చాను. అది నెరవేరింది. ఆయనకు కథ చెప్పేశాను. నేను వచ్చిన పని నెరవేరింది సార్.. అంటూ అక్కడే ఏడ్చేశాను అంటూ చెప్పుకొచ్చాడు.