Advertisement
Google Ads BL

పవన్‌‌ని డైరెక్ట్ చేసేది ఈ దర్శకుడేనా..?


మైత్రి మూవీ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ ఓ సినిమా బాకీ ఉన్నాడని అందరికి తెలిసిన విషయమే. ఈ విషయాన్ని మైత్రి ప్రొడ్యూసర్స్ అఫీషియల్ గా చెప్పారు. పవన్ కళ్యాణ్ కు ఆల్రెడీ మేము అడ్వాన్స్ ఇచ్చి ఉన్నామని... పవన్ మా బ్యానర్ లో సినిమా చేస్తానన్నాడని చెప్పారు. సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ‘తేరి’ సినిమాను రీమేక్ చేయబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే పవన్ సంతోష్ తో ఫ్రెష్ స్టోరీ చేద్దాం అని చెప్పి పాలిటిక్స్ లో బిజీ అయ్యిపోయాడు. దాంతో సంతోష్ శ్రీనివాస్ రవితేజ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

Advertisement
CJ Advs

ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ఆ దర్శకుడు కూడా ఖ‌రారైపోయాడ‌ని టాక్‌. పవన్ తో ‘గోపాల గోపాల‌’,‘కాట‌మ‌రాయుడు’ చిత్రాలు తీసిన డాలీకి మరో ఛాన్స్ ఇచ్చాడట పవన్. ఈ మధ్యలో డైరెక్టర్ బాబీ పేరు కూడా తెరపైకి వచ్చింది. పవన్ బాబీ తో ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్‌’ చేశాడు. అది డిజాస్టర్ అయింది. మళ్లీ సేమ్ కాంబినేషన్ ఎందుకు రిపీట్ చేయడం అని డాలీకి అవకాశం ఇచ్చాడని సమాచారం.

పవన్ పాలిటిక్స్ తో బిజీగా ఉంటూనే తెర వెనుక ప‌నుల‌న్నీ స్పీడు స్పీడుగా జ‌రుగుతున్న‌ట్టు టాక్. మరి పవన్ ఎలక్షన్స్ తరువాత ఈ సినిమా చేస్తాడా? లేదా ఈలోపే చకచకా కానిచ్చేస్తాడా? చూడాలి. మరి కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వచ్చే అవకాశం ఉంది. సో పవన్ ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్.

Power Star Pawan Kalyan’s re-entry to movies:

Again Dolly Directs Pawan Kalyan in his next
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs