Advertisement
Google Ads BL

‘టాక్సీవాలా’.. దుమ్మురేపుతున్నాడుగా..!!


విజయ్ దేవరకొండ తాజా చిత్రం టాక్సీవాలా సూపర్ హిట్ కలెక్షన్స్‌తో, సూపర్ టాక్‌తో దూసుకుపోతుంది. మొన్న శనివారం విడుదలైన టాక్సీవాలా సినిమా విడుదలకు ముందు అనేక కష్టాలు పడింది. మధ్యలో విజయ్ దేవరకొండకి ఈ సినిమా మీద నమ్మకం లేక గీత గోవిందం సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడని కూడా అన్నారు. గీత గోవిందం మీదున్న కాన్ఫిడెన్స్ తో విజయ్ దేవరకొండ టాక్సీవాలా సినిమాని లైట్ తీసుకున్నాడన్నారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం టాక్సీవాలా సినిమా విడుదల సమస్యల్లా.. ఆ సినిమా గ్రాఫిక్స్ పూర్తి కానీ కారణంగా ఈ సినిమాని విడుదలకు లేట్ అవుతుందని చెప్పాడు. మధ్యలో అనుకోకుండా సినిమా మొత్తం ఆన్ లైన్ లో లీక్ కావడం.. నిర్మాత ఎస్.కే.ఎన్ హడావిడిగా పోలీస్‌లను సంప్రదించి ఆ లింక్స్ ని యూట్యూబ్ నుండి తొలగించడంతో పరిస్థితి సద్దుమణిగింది.

Advertisement
CJ Advs

ఇక రవితేజ సినిమా అమర్ అక్బర్ ఆంటొని సినిమా మీద పోటీగా డేట్ ప్రకటించిన విజయ్ దేవరకొండ తన శక్తికి మించి ప్రమోషన్స్ చేసి సినిమా థియేటర్స్ లోకి తెచ్చాడు. విజయ్ అదృష్టమో, ఎస్.కే.ఎన్  అదృష్టమో సినిమాకి పాజిటివ్ టాక్ పడడమే కాదు. సినిమా మొత్తం లీకైనా కలెక్షన్ మాత్రం అదిరిపోతున్నాయి. ఫస్ట్ వీకెండ్ లోనే 9.5 కోట్లు కొల్లగొట్టిన టాక్సీవాలా మరో పదిరోజుల పాటు థియేటర్స్‌లో దున్నేయ్యడం ఖాయంగానే కనబడుతుంది. ఎందుకంటే రేపు శుక్రవారం థియేటర్స్ లోకొచ్చే సినిమాలు పెద్ద ఇంట్రెస్టింగ్‌గా కనిపించడం లేదు.

ఈ శుక్రవారం హెబ్బా పటేల్ నటించిన 24 కిస్సెస్ అనే సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలు విడుదలవులున్నాయి. మరి 24 కిస్సెస్ సినిమా మీద ఓ.. అన్నంతగా అంచనాలు అయితే లేవు. అయినా ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఆ సినిమాకి కనెక్ట్ అవడం ఉంటుంది. అదీ టాక్ తేడా కొడితే ఆ సినిమాకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. సో అలా టాక్సీవాలా మరో వారం రోజులు అంటే  సూపర్ స్టార్ రజినీకాంత్ 2.ఓ తో దిగేవరకు మనోడికి తిరుగులేదన్నమాట. ఏదైనా విజయ్ దేవరకొండ అదృష్టమంటే అదృష్టం అని చెప్పుకోవాలిక్కడ.

One More Week to Vijay Taxiwala :

Taxiwala is minting decent numbers at box office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs