అరుణ్ ఆదిత్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా ‘మిణుగురులు’ ఫేమ్ అయోధ్యకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘24 కిస్సెస్’ చిత్రం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఈ సినిమా గురించి ఓ న్యూస్ నిర్వహించిన డిబెట్ కార్యక్రమంలో రసాభాసగా మారి.. కొట్టుకునే స్థాయికి వచ్చిందంటే.. ఎంతగా ఈ ముద్దుల వివాదం ముదిరిందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ సినిమాకి సంబంధించి అందరూ ముద్దుల గురించే మాట్లాడుతున్నారు కానీ.. సినిమాలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. వాటిని ఎవరూ మాట్లాడటం లేదంటూ.. జరుగుతున్న గొడవలో నుంచి అర్థాంతరంగా లేచి వెళ్లిపోయింది హీరోయిన్ హెబ్బాపటేల్.
ఇక హీరో అరుణ్ ఆదిత్ అయితే యాంకర్‌పై పోరాటానికి కూడా రెడీ అయ్యాడు. ‘పర్వర్షన్’ అంటూ ఆయన చాలా సీరియస్‌గా యాంకర్‌పై ఫైర్ అవుతూ.. కిస్‌ను వల్గర్ అని ఎందుకు అంటారు.. అంటూ గట్టిగానే లేచాడు. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇక ఇది టిబెట్ ప్రోగ్రామ్ కాదు.. చేపల సంతలా తయారైందంటే.. ఎంతగా యవ్వారం ముదిరిపోయిందో ఊహించుకోవచ్చు.