Advertisement
Google Ads BL

ప్రజల పవర్ తెలిసేది ఆ రోజే..!!


శ్రీ సుదర్శన చక్ర క్రియేషన్స్ పతాకంపై శివ, సోనా పటేల్ హీరో హీరోయిన్లుగా పైడి రమేష్ దర్శకత్వంలో పైడి సూర్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘రూల్’ (ది పవర్ ఆఫ్ పీపుల్). ఈ చిత్రం నవంబర్ 23న విడుదలవుతున్న సందర్భంలో చిత్ర యూనిట్ తెలుగు ఫిలింఛాంబర్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా దర్శకుడు పైడి రమేష్ మాట్లాడుతూ... ‘‘రూల్ (ది పవర్ ఆఫ్ పీపుల్).. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆడియోను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మోషన్ పోస్టర్‌ను, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫస్ట్ లుక్ ను, ప్రొడ్యూసర్ అశ్వినిదత్ టీజర్ ను, డైరెక్టర్ బోయపాటి శ్రీను ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంత మంది సినీ రాజకీయ ప్రముఖులు నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. కథ విషయానికి వస్తే హీరో ఒక యువజన నాయకుడు. తన కుటుంబంతో పాటు ఎన్నోకుటుంబాలకు అన్యాయం జరగకుండా ఆపి, ఎలా ఆదర్శవంతుడిగా నిలిచాడన్నది ఈ చిత్ర కథాంశం. చిత్రంలో నాలుగు పాటలున్నాయి. రమణ సాయిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. హైదరాబాద్, వైజాగ్, అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. నవంబర్ 23న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాము..’’ అని అన్నారు. 

నిర్మాత పైడి సూర్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘ఆవేశం కంటే ఆలోచనలు ముఖ్యమనీ, మనీ కంటే మనుషుల విలువలు ముఖ్యమనీ తెలియజేసే మంచి మెసేజ్ చిత్రాన్ని నిర్మించాను. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్‌గా అనిపించింది. తెలంగాణ ఎలక్షన్స్ టైములో మా రూల్ చిత్రం విడుదల కావటం సంతోషంగా ఉంది..’’ అన్నారు. 

హీరోయిన్ సోనా పటేల్ మాట్లాడుతూ.. ‘‘చాలా మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రం ఇది. నాకు మంచి పంచ్ డైలాగ్స్ ఇచ్చారు. నా క్యారెక్టర్ తో పాటు సినిమా కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను..’’ అన్నారు. 

హీరో శివ మాట్లాడుతూ.. ‘‘కెమెరామెన్‌గా ఉన్న నన్నుఈ సినిమాలో హీరోను చేశారు డైరెక్టర్. ప్రజలకు ఉపయోగడే చిత్రం. తప్పకుండా సినిమా చూసి ఆదరించాలని కోరుతున్నాను..’’ అన్నారు. 

Rule Movie Ready to Release:

Rule The Power Of People Movie Release Press Meet Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs