Advertisement
Google Ads BL

అను తప్పుకోవడమే మంచిదైంది.. లేదంటే..?


అను ఇమ్మాన్యుయేల్ శైలజా రెడ్డి అల్లుడు సినిమా యావరేజ్ తో సినిమాలు లేక ఖాళీ అయ్యింది. అజ్ఞాతవాసి మొదలు ఒక్క హిట్ కూడా అను ఖాతాలో పడనే లేదు. అజ్ఞాతవాసి సినిమాలో పవన్ సరసన ప్రాధాన్యత లేని పాత్రలో నటించిన అను ఇమ్మాన్యువల్... నా పేరు సూర్య లో అల్లు అర్జున్ సరసన నటించింది. ఆ సినిమా కూడా ప్లాప్ అవడంతో అను పరిస్థితి ఘోరంగా తయారైంది. అయితే తర్వాత నాగ చైతన్య సరసన మారుతీ దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో కాస్త రిచ్ అమ్మాయి పాత్రలో నటించింది. ఆ సినిమా కూడా యావరేజే కానీ హిట్ అవలేదు. టాక్ యావరేజే, కలెక్షన్స్ ప్లాప్ అన్నట్టుగా ఉంది శైలజా రెడ్డి అల్లుడు పరిస్థితి.

Advertisement
CJ Advs

అయితే శైలజ రెడ్డి అల్లుడు సినిమా చేసినప్పుడు డేట్స్ లేవని చెప్పి... రవితేజ - శ్రీను వైట్ల కాంబో మూవీ అమర్ అక్బర్ ఆంటొనిలో హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యి అనుకోకుండా ఆ సినిమా నుండి అను ఇమ్మాన్యువల్ బయటికొచ్చేసింది. అయితే అప్పట్లో ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత లేకపోవడం వలనే అను బయటికొచ్చిందనే ప్రచారం జరిగింది. కానీ అను ప్లేస్ లోకి ఇలియానా వచ్చేసరికి అయ్యో.. అను మంచి పాత్ర మిస్ చేసుకుందిగా అని అన్నారు. కానీ శుక్రవారం విడుదలైన రవితేజ - ఇలియానా ల అమర్ అక్బర్ ఆంటొని సినిమా మొదటి షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి అసలు ప్రాధాన్యతే లేదు.

ఇల్లి బేబీకి సినిమాలు లేక ఒప్పుకుందేమో కానీ.. అను ఆ సినిమా నుండి తప్పుకుని మరొక ప్లాప్ నుండి తప్పించుకుంది అనే అంటున్నారు. ఇలియానా కేరెక్టర్ కి అసలు స్కోప్ లేకపోవడం..... ఆమెని కేవలం గ్లామర్ డాల్ గానే దర్శకుడు శ్రీను వైట్ల వాడిన తీరు చూసాక అను ఇమ్మాన్యువల్ కి అవకాశాలు లేకపోతేనేం ఒక ప్లాప్ సినిమా నుండి బయటికెళ్ళిపోయి మంచి పని చేసిందని అంటున్నారు.

Anu Emmanuel Takes Right Decision about AAA:

<span>Anu Emmanuel Good Decision about Amar Akbar Antony</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs