Advertisement
Google Ads BL

‘స‌మ‌యం లేదు మిత్ర‌మా’.. టైటిల్‌గా వాడేశారు!


‘స‌మ‌యం లేదు మిత్ర‌మా’ షూటింగ్ ప్రారంభం

Advertisement
CJ Advs

కె.వి.ప్రొడ‌క్ష‌న్ బ్యానర్‌లో.. ఎమ్. వరప్రసాద్ దర్శకత్వంలో నిర్మాత జి.ఎమ్. ముర‌ళీధ‌ర్ నిర్మిస్తున్న చిత్రం ‘స‌మ‌యం లేదు మిత్ర‌మా’.  ఈ చిత్ర ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో జరిగింది. పూర్తి కామెడీ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నోయ‌ల్‌, ట్వింకిల్ సౌజ్ (తొలిప‌రిచ‌యం) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత జి.ఎమ్. మురళీధర్ మాట్లాడుతూ.. ‘‘ఇది నా మొద‌టి చిత్రం. డైరెక్ట‌ర్‌ వరప్రసాద్ చెప్పిన కథ, కథనం నచ్చి.. ఈ సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చాం. మాకు మీ అంద‌రి ఆద‌ర‌ణ కావాలి..’’ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ఎమ్.వ‌ర‌ప్ర‌సాద్ మాట్లాడుతూ.. ‘‘టైటిల్ మీకు తెలిసిందే. క్యాచీ టైటిల్‌. ఈ చిత్రం కామెడీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్. న‌న్నున‌మ్మి మా ప్రొడ్యూస‌ర్‌గారు ఈ బాధ్యతలు అప్ప‌గించారు. అంద‌రం క‌లిసి చేస్తున్నాం. ఈ చిత్రానికి చాలా మంచి టెక్నీషియ‌న్లు కూడా కుదిరారు. న‌గేష్ ఈ చిత్రంలో త‌న విశ్వ‌రూపం చూపించ‌బోతున్నారు..’’ అని అన్నారు.

న‌గేష్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో నేను మొయిన్ విల‌న్‌గా చేస్తున్నాను. నాకు ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు’’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాంచాల కిషన్ మాట్లాడుతూ..‘‘ఈ సినిమాకి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. స్టోరీ బాగా కుదిరింది. తప్పకుండా అందరికీ నచ్చేలా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తాము..’’ అని అన్నారు.

నోయ‌ల్ మాట్లాడుతూ.. ‘‘టైటిల్‌లోనే సినిమా ఎలా ఉండబోతోందో అర్ధ‌మైపోతుంది. నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు. ఈ చిత్రంలో నేను చాలా మంచి క్యారెక్ట‌ర్‌ని చేస్తున్నాను. ఈ సినిమా నాకు చాలా ప్ల‌స్ అవుతుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. రైట‌ర్ ఈ చిత్రానికి డైలాగులు బాగా రాశారు. మా చిత్రానికి అంద‌రూ త‌ప్ప‌క స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

ఈ చిత్రానికి స‌హ‌నిర్మాతలు: చ‌ల్లా మ‌హేష్‌, అశోక్‌గౌడ్‌,  డైలాగ్స్: కోలా న‌వీన్‌, కొరియోగ్ర‌ఫీ: అని‌, స్టంట్స్: దేవ‌రాజ్‌, ఆర్ట్: ఆనంద్, ఎడిట‌ర్: ఉపేంద్ర‌, సంగీతం: అజ‌య్‌ప‌ట్నాయ‌క్‌, డి.ఓ.పి: ప్ర‌వీణ్ కె.కావ‌ళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మాంచాల కిషన్, నిర్మాత: జి.ఎమ్. మురళీధర్, దర్శకత్వం: ఎమ్.వ‌ర‌ప్ర‌సాద్.

Samayam Ledu Mitrama Movie Started:

Movie on Samayam ledu Mitrama Title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs