Advertisement
Google Ads BL

మైత్రి మూవీస్ ఇకనైనా జాగ్రత్తపడాలి..!!


సాధారణంగా ప్రొడ్యూసర్స్ అనేవాళ్లు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలంటే కొన్ని చిన్న సినిమాలు చేసి అవి సక్సెస్ అందుకున్నాక పెద్ద సినిమాల వేటలో పడతారు. అయితే మైత్రి మూవీస్ వారు ఇందుకు వ్యతిరేకంగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. స్టార్టింగే స్టార్ హీరో అయిన మహేష్ తో సినిమా ప్లాన్ చేశారు. ఒక్క సినిమానే అనుభవం ఉన్న కొరటాలతో ఊరిని దత్తత తీసుకోవడం వంటి రిస్క్ పాయింట్ ను తీసుకున్నారు. కమర్షియల్ గా పర్ఫెక్ట్ గా డీల్ చేయడంతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలయ్యాయి. దాంతో ఫస్ట్ సినిమాతోనే మర్చిపోలేని సక్సెస్ ని అందుకున్నారు మైత్రి వారు.

Advertisement
CJ Advs

అలానే తర్వాత అదే డైరెక్టర్ తో ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి జనతా గ్యారేజ్ అనే సినిమాను తీసి మరోసారి సక్సెస్ అందుకున్నారు. మూడో సినిమా కోసం క్రేజీ కాంబినేషన్ ను తెరపైకి తీసుకొచ్చారు. సుకుమార్ - రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ‘రంగస్థలం’ సినిమా తీసి నాన్ బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేశారు. అలా మూడు సూపర్ హిట్ చిత్రాలు తీసి హ్యట్రిక్ కొట్టారు.

కానీ ఇప్పుడు మైత్రి మూవీస్ కి టఫ్ టైం వచ్చినట్టే కనిపిస్తోంది. నాగ చైతన్య కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ పెట్టి బాలీవుడ్ నుండి మాధవన్ ను తీసుకొచ్చి ‘సవ్యసాచి’ సినిమాను చేశారు కానీ అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. రిలీజ్ అయిన రెండు వారాల్లోనే చాలా చోట్ల సినిమాను తీసేశారు. ఈ రకంగా మైత్రి జైత్ర యాత్రకు మొదటి బ్రేక్ పడింది. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాల్లోనే ఈ బ్యానర్ నుండి మరో సినిమా వచ్చింది. శ్రీను వైట్ల..రవితేజ లాంటి కాంబినేషన్ తో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా వచ్చింది. రిలీజ్ అయిన మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ రావడంతో మరొక ప్లాప్ మైత్రి బ్యానర్ కు తోడయ్యింది. 

ఈరెండు సినిమాలు కథలు పరంగా ఫెయిల్ అయ్యాయి. దాంతో ఇప్పుడు ఈ రెండింటిని మైత్రి వార్నింగ్ బెల్ లా తీసుకోవాలి. కథలు.. కాంబినేషన్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరికొన్ని దెబ్బలు తగిలే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం వీరి బ్యానర్ లో మహేష్ - సుకుమార్ ల కాంబోలో ప్లాన్ చేసిన మూవీ తప్ప మిగిలినవన్నీ హీరోల పరంగా మార్కెట్ పరంగా రిస్క్ ఉన్నవే. మరి ఇటువంటి దెబ్బలు తగిలాక సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు.

Bad Time to Mythri Movie Makers:

One more Flop Movie to Mythri Movie Makers
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs