Advertisement
Google Ads BL

‘అక్షర’ ప్రయాణం మొదలైంది..!


సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బేనర్ పై అహితేజ బెల్లకొండ, సురేష్ వర్మలు కలిసి నిర్మిస్తున్న ‘అక్షర’ మూవీ అన్నపూర్ణ స్టూడియోస్ లో సినీరంగ ప్రముఖులు, ఆత్మీయుల మధ్య ఆహ్లాదంగా ప్రారంభమైంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ నందితాశ్వేత ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాకి క్లాప్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇవ్వగా,  కెమెరా స్విచ్ఛాన్ ప్రముఖ పారిశ్రామికవేత్త రఘరామ కృష్ణంరాజు చేశారు. తొలి సన్నివేశానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. యంగ్ హీరోస్ కార్తీకేయ, విజయ్ రాహుల్, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల  స్క్రిప్ట్ ని నిర్మాతలు, సురేష్ వర్మ, అహితేజ బెల్లంకొండకు అందించి  శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  మాట్లాడుతూ: హీరోయిన్ నందితాశ్వేత మాట్లాడుతూ: ‘‘కథ వినగానే ఎగ్జైట్ అయ్యాను. నిర్మాతలు సురేష్ వర్మ, అహితేజల కొత్త ఆలోచనలు నన్ను ఇంప్రెసె చేశాయి. ఈ పాత్రకు నన్ను ఎంచుకున్నందుకు దర్శకుడు

చిన్నికృష్ణ గారికి చాలా థ్యాంక్స్.  చాలా కాన్పిడెన్స్ గా ఉన్నాను, సక్సెస్ మీట్ లో మాట్లాడుతున్నంత హ్యాపీగా ఉన్నాను.  చాలా రెస్సాన్సిబుల్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాను, కొంచెం భయంగా ఉంది. సినిమా అంతా నా పాత్ర మీద నడుస్తుంది. కానీ మేం ఒక మంచి కథను తెరమీదకు తీసుకువస్తున్నాం అనే నమ్మకం ఉంది. మీ అంచనాలను తప్పకుండా అందుకుంటా అనే నమ్మకం నాకు కాన్సెప్ట్ టీజర్ షూట్ చేస్తున్నపుడే కలిగింది. రిలీజ్ అయిన కాన్సెప్ట్ టీజర్ కి మంచి రెస్సాన్స్ వచ్చింది.’’ అన్నారు.

దర్శకుడు బి. చిన్నికృష్ణ మాట్లాడుతూ: ‘‘ఈ కథను నమ్మి నాకు దర్శకుడుగా అవకాశం ఇచ్చిన నిర్మాతలు సురేష్, అహితేజలకు థ్యాంక్స్. ఈ బ్యానర్ ని నిలబెట్టే సినిమా అవుతుందనే నమ్మకం నాకు ఉంది.  ఎడ్యుకేషన్ వ్యవస్థలోని వాస్తవాలను ఎంటర్ టైన్మెంట్ మిస్ అవ్వకుండా చెప్పబోతున్నాం. నందితా శ్వేతతో పాటు మరో మూడు క్యారెక్టర్స్ ముఖ్య పాత్రలలో కనిపిస్తాయి. వారి వివరాలు త్వరలో ప్రకటిస్తాం. మా

ప్రయత్నానికి అండగా నిలిచి మమల్ని ప్రొత్సహించడానికి వచ్చిన అతిథులకు, మీడియా వారికి కృతజ్ఞతలు.’’ అన్నారు.

నిర్మాత అహితేజ బెల్లంకొండ మాట్లాడుతూ: ‘‘సినిమా  కాన్సెప్ట్ ని ఒక టీజర్ గా రిలీజ్ చేశాం దానికి మంచి స్పందన వచ్చింది. ఎడ్యుకేషన్ బ్యాక్ డ్రాప్ లోని వాస్తవాలను  కొన్ని రియల్ ఇన్సిడెంట్ లు ఆధారంగా తీసుకున్నాం. ఎంటర్ టైన్మెంట్ వేలో ఈ కథ నడుస్తుంది. మిగతా నటీనటుల వివరాలను అతి త్వరలో తెలియజేస్తాం. డిసెంబర్ రెండో వారంలో షూట్ ని ప్రారంభించి సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం.’’అన్నారు.

మరో నిర్మాత సురేష్ వర్మ మాట్లాడుతూ: ‘‘సినిమా ప్రారంభం ముందే మా కాన్సెప్ట్ ని ప్రేక్షకులకు అందించాలని కాన్సెప్ట్ టీజర్ ని ప్లాన్ చేశాం . ఆ టీజర్ ఇండస్ట్రీలోనూ, ఆడియన్స్ లోనూ ‘అక్షర’ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ని కలిగించింది. కథ చెప్పగానే యాక్సెప్ట్ చేసిన నందితాశ్వేతకు థ్యాంక్స్. ఆడియన్స్ ఆలోచనలలో మార్పు కలిగించే చిత్రం అవుతుందనే నమ్మకం కథపై ఉంది.’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్  బొబ్బిలి మాట్లాడుతూ: ‘‘కథ వినగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న కథ నాకు దొరికింది.  ఈ చిత్ర యూనిట్ కి నా అభినందనలు తెలుపుతున్నాను’’ అన్నారు.

ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు: కెమెరామాన్: జి.శివ, మ్యూజిక్  డైరెక్టర్: సురేష్ బొబ్బిలి, ఎడిటర్: జి. సత్య,  ఆర్ట్ డైరెక్టర్: నరేష్ బాబు తిమ్మిరి, కాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు, లైన్ ప్రొడ్యూసర్స్:  గంగాధర్, రాజు ఓలేటి, పి.ఆర్. ఓ:  జియస్ కె మీడియా, సి.ఎఫ్. ఓ: ‘యస్ మీడియా’ సుమంత్, కో ప్రొడ్యూసర్: కె.శ్రీనివాస రెడ్డి నిర్మాణ సంస్థ:  సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాతలు: సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ, రచన, దర్శకత్వం: బి. చిన్నికృష్ణ

Nanditha Swetha’s AKSHARA Movie Opening:

AKSHARA Movie Opening Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs