Advertisement
Google Ads BL

ఈ కొంటె కుర్రాడు రవితేజ ఫ్యానంట!


శ్రీ రామ రక్ష ఫిలిమ్స్, స్మైలింగ్ డ్రీమ్స్, సంస్థలు సంయుక్తంగా సాగర్ యమ్ యన్ వి, వెన్నెల విహర్ హీరో  హీరోయిన్లుగా, సాగర్ యమ్ యన్ వి దర్శకత్వంలో ఏనుగుతల దేవదాసు, సైధూల్ బాథరాజ్ (సిద్దు) నిర్మిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘కొంటె కుర్రాడు’. ఓ లోఫర్ గాడి ప్రేమ కథ ట్యాగ్ లైన్. ఇటీవలే రాజ్ కందుకూరి ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు. హీరో రవితేజ అమర్ అక్బర్ అంథోని చిత్రం విడుదల సందర్భంగా ఓ ప్రత్యేక పాటను ఈ చిత్ర యూనిట్ రవితేజకు డెడికెట్ చేశారు. 

Advertisement
CJ Advs

ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.. మా హీరో దర్శకుడు సాగర్  మాస్ మహారాజ్ రవితేజకి వీరాభిమాని. శుక్రవారం రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ అంథోని’ సినిమా విడుదల సందర్భంగా మా చిత్ర సంగీత దర్శకుడు  యస్ ఏ అరమాన్ రచించిన, ప్రముఖ గాయకుడు రాంకి ఆలపించిన ఒక స్పెషల్ సాంగ్ ని మాస్ మహారాజ్ కి డెడికేట్ చేస్తూ, కూకట్ పల్లి వసంత నగర్ లో ‘అరుణ ప్రియ ఓల్డేజ్ హోమ్’ వృద్ధుల మధ్య విడుదల చేశాము. సాగర్  ఈ సినిమాని చాలా బాగా తీర్చిదిద్దుతున్నారు‌. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని  అన్నారు.

మాస్ లవ్ ఎంటర్టైనర్ గా తీస్తొన్న ఈ సినిమాలో తాను రవితేజ గారి అభిమానిగా కనిపిస్తానని, సస్పెన్స్ లవ్ తో ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ ఉంటుందని, మరో హీరోయిన్ నెక్స్ట్ షెడ్యూల్ లో జాయిన్ అవుతుందని హీరో, దర్శకుడు సాగర్  అన్నారు. 

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ప్రవీణ్. కె కావలి, మ్యూజిక్: యస్.ఏ. అరమాన్, ఎడిటింగ్: మహేశ్, పోస్టర్ డిజైనింగ్: జగదీష్ కుమార్, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: సాగర్ యమ్ యన్ వి.

Konte Kurradu is Raviteja Fan:

Konte Kurradu Movie Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs