Advertisement
Google Ads BL

బాబు వ్యూహంలో యంగ్ టైగర్ పడినట్లేనా?


ఎప్పటినుండో చంద్రబాబు, బాలకృష్ణలు జూనియర్ ఎన్టీఆర్ ని పక్కనబెట్టేశారు. హరికృష్ణ కోసమే కళ్యాణ్ రామ్ కూడా కాంప్రమైజ్ అయ్యి ఎన్టీఆర్ తో కలిసాడు కానీ... కళ్యాణ్ రామ్ కూడా దూరంగానే వుండేవాడు. ఇక హరికృష్ణ మరణం మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌ని మళ్ళీ చంద్రబాబు, బాలయ్యలకు దగ్గర చేసిందనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సక్సెస్ ఈవెంట్ కి వచ్చిన బాలయ్య పెద్దరికం వహించినా ఎక్కడో ఎన్టీఆర్ పట్ల విముఖత ఉన్నట్లే కనబడింది. ఇక హరికృష్ణ మరణంతో ఫ్యామిలీ అంతా ఒకటయ్యిందని, రాబోయే తెలంగాణ ఎన్నికల్లో నందమూరి కుటుంబం నుండి బాలయ్యతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీ తరుపున ప్రచారానికి వెళతాడని వార్తలు బాగానే వీస్తున్నాయి.

Advertisement
CJ Advs

అయితే తెలంగాణాలో టీడీపీ ప్రచారానికేమో గాని.. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీ తరుపున ప్రచారానికి వెళ్లాల్సిన పరిస్థితి. ఎన్టీఆర్ సంగతి పక్కనబెట్టి హరికృష్ణ కుటుంబంతో మునుపుటి సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడు. అందుకే కూకట్‌పల్లి నియోజకవర్గ స్థానాన్ని ముందు కళ్యాణ్‌రామ్‌కి ఇద్దామనుకుంటే కళ్యాణ్‌రామ్ పాలిటిక్స్ వద్దన్నాడట. ఇక ఆయన భార్యనడిగితే ఆవిడా వద్దనేసరికి హరికృష్ణ కూతురు సుహాసినిని తెరమీదకి తీసుకొచ్చారు. మొన్న వైజాగ్ వెళ్లి మామ చంద్రబాబుని కలిసి టికెట్ ఇచ్చినందుకు గాను కృతఙ్ఞతలు చెప్పిన సుహాసిని నిన్న(శుక్రవారం) సాయంత్రం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఇంతవరకు ఎప్పుడూ హరికృష్ణ కూతురు సుహాసిని ఎక్కడా ఫోకస్ కాలేదు. హరికృష్ణ మరణం వరకు ఆయనకో కూతురు ఉన్నట్టు కూడా ఎవ్వరికీ తెలియదు.

అయితే ఈ రోజు నామినేషన్ వేయనున్న సుహాసిని‌కి  అండగా కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్ లు ఉంటారా? అసలింతవరకు సుహాసిని సీటొచ్చిన విషయంపైనా అన్నదమ్ముల స్పందనే లేదు. అయితే టిడిపికి ఇప్పటి వరకు దూరమైన ఎన్టీఆర్ మాత్రం ఈసారి సుహాసిని కోసం ప్రచారానికి వచ్చేట్లుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఈసారి టీడీపీ ప్రచారానికి తప్పించినా, తప్పుకుందామనుకున్నా ఎన్టీఆర్‌కి కుదిరేలా లేదు. మరి సుహాసిని నామినేషన్ వేశాక తన కుటుంబం అంటే బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ప్రచారం చేస్తారో లేదో మీడియాకి వివరిస్తానని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పింది. ఏది ఏమైనా ఈసారి ఎన్టీఆర్ కి మాత్రం ఈ ప్రచారం తప్పనట్టుగానే ఉంది.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి RRR కోసం కూడా రెడీ అవుతున్నాడు. RRR మల్టీస్టారర్ కోసం న్యూ లుక్ లోకి మారుతున్న ఎన్టీఆర్ ఈ నెల 19 నుండి రాజమౌళి సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. మరి ఇటు ఎన్నికల ప్రచారం, అటు సినిమా షూటింగ్ తో ఎన్టీఆర్ బాగా బిజీ కాబోతున్నాడు. హరికృష్ణ మరణంతో సుహాసినికి సానుభూతి ఉన్నప్పటికీ... ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల ఎన్నికల ప్రచారం కూడా అవసరమవుతుంది కాబట్టి ఎన్టీఆర్‌ గట్టిగానే బాబు వలలో చిక్కేశాడని రాజకీయ పండితులు చెప్పుతుండటం విశేషం.

CBN Trapped NTR?:

Jr NTR’s Sister Suhasini is MLA Candidate
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs