సౌత్‌లో ఒక రేంజ్ అవకాశాలున్నపుడే.. బాలీవుడ్ బాలీవుడ్ అంటూ పరుగులుపెట్టి... టాప్ హీరోయిన్ గా మారదామనుకున్నగోవా సుందరి ఇలియానాకి బాలీవుడ్ లో నాలుగైదు అవకాశాలతోనే పంచ్ పడింది. దెబ్బకి మళ్ళీ సౌత్ ని వెతుక్కుంటూ వెనక్కి తిరిగిన ఇలియానా తెలుగులో అమర్ అక్బర్ ఆంటొని సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. జులాయి సినిమా వరకు సన్నని నడుముతో షేక్ చేసిన ఇలియానా ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటొనిలో మాత్రం బొద్దుతనంతో అందరికి షాకిచ్చింది. అసలెప్పుడు లావైందో కూడా అర్ధం కానీ పరిస్థితి. సినిమా అవకాశాలు కావాలనుకున్నప్పుడు సన్నగా నాజూగ్గా ఉండడం హీరోయిన్స్ ప్రధమ లక్షణం. కానీ ఇలియానా సినిమాలకు బై బై చెప్పేద్దామనో.. ఇక అవకాశాలు రావని ఫిక్స్ అయ్యిందో గాని ఒళ్ళు బాగా పెంచేసింది.
అమర్ అక్బర్ ఆంటొని హిట్ అయితే కొవ్వు ఎమన్నా కరిగిస్తుందేమో తెలియదు కానీ.. ప్రస్తుతం ఇలియానా రీఎంట్రీలో రిజెక్ట్ చేసే హీరోలు బయలుదేరారు. మరి స్టార్ హీరోలు రిజెక్ట్ చేస్తే.. పోనిలే క్రేజ్ పోయింది అమ్మడుకి స్టార్ హీరోలేం అవకాశాలిస్తారు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇలియానాని రిజెక్ట్ చేసిన హీరో మాత్రం ఒక ప్లాప్ హీరో. వరసగా సినిమాలు ప్లాప్ అవుతున్న హీరో గోపీచంద్.. ఇలియానా అయితే వద్దనేశాడనే టాక్ నడుస్తుంది. తమిళనాట విశాల్ హీరోగా ఇంద్రుడు సినిమా చేసిన దర్శకుడు తిరు.. గోపీచంద్ తో తెలుగు, తమిళంలో ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు.
అయితే బైలింగువల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు తమిళానికి తెలిసిన హీరోయిన్ అయితే బావుంటుందని భావించిన దర్శకుడు తిరు రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా పేరుని హీరోయిన్ లిస్ట్ లో పెట్టాడట. అయితే ప్రస్తుతం బొద్దుగా అస్సలు క్రేజ్ లేని ఇలియానా పేరు చెప్పగానే గోపీచంద్ వద్దనేశాడనే టాక్ ఫిలింనగర్ లో వినబడుతుంది. అసలు మన సినిమాలకు అంచనాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఇక ఇప్పుడు క్రేజ్ లేని ఇలియానాని హీరోయిన్ అంటే సినిమా మీద ఎవరికీ ఆసక్తి ఉండదని గోపీచంద్.. ఇలియానాని రిజెక్ట్ చేసినట్లుగా కనబడుతుంది వ్యవహారం.