Advertisement
Google Ads BL

‘నెక్ట్స్ ఏంటి’ ఆయన చేతుల్లోకి..!!


శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్లో గౌరి కృష్ణ విడుదల చేస్తున్న  తమన్నా, సందీప్ ‘నెక్ట్స్ ఏంటి’ 

Advertisement
CJ Advs

యూత్ లో తమన్నా గ్లామర్ కున్న ఫాలోయింగ్ గురించి  ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యువ హీరోల్లో మంచి సక్సెస్ చిత్రాల్లో నటించిన సందీప్ కిషన్ నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. వీరిద్దరి కలయికలో ఫనా, హమ్ తుమ్ చిత్రాల దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘నెక్స్ట్ ఏంటి’.  ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి ఓ బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు సినిమాకి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. నవదీప్, పూనమ్ కౌర్ ఇందులో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రానికి భారీ క్రేజ్ నెలకొంది. ఈ క్రేజీ ప్రాజెక్టు తెలుగు హక్కుల్ని నిర్మాత గౌరీ కృష్ణ దక్కించుకున్నారు. ఈ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా ట్రేడ్ వర్గాల్లో భారీ కాంపిటీషన్ నెలకొంది. గతంలో కథకళి, కిల్లింగ్ వీరప్పన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్ని గ్రాండ్ గా రిలీజ్ చేసిన శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ అధినేత గౌరి కృష్ణ ఈ చిత్ర రైట్స్ దక్కించుకున్నారు. నెక్ట్స్ ఏంటి చిత్రాన్ని డిసెంబర్ ప్రథమార్థంలో అత్యధిక థియేటర్లలో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా శ్రీ కృష్ణ క్రియేషన్స్ అధినేత గౌరి కృష్ణ మాట్లాడుతూ.. ‘‘తమన్నా, సందీప్  జంటగా నటించిన నెక్ట్స్ ఏంటి చిత్రం ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన లభించింది. ఓ తెలుగు చిత్రానికి ఫనా, హమ్ తుమ్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని హిందీలో తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ వర్క్ చేస్తుండడం ఈ సినిమాకు మెయిన్ హైలైట్. తెలుగు ప్రేక్షకుల్ని కట్టి పడేసే కథ, కథనం, బాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ తో నెక్ట్స్ ఏంటి చిత్రం  రూపొందించడం జరిగింది. అలాంటి క్రేజీ ప్రాజెక్టును మా శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం చాలా మంది పోటీ పడ్డప్పటికీ మా సంస్థ ద్వారానే ఈ సినిమా రిలీజ్ అవుతున్నందుకు సంతోషిస్తున్నాం. గతంలో మేం కథకళి, కిల్లింగ్ వీరప్పన్ చిత్రాల్ని గ్రాండ్ గా రిలీజ్ చేశాం. అదే మాదిరిగా నెక్ట్స్ ఏంటి చిత్రాన్ని సైతం అత్యధిక థియేటర్లలో భారీ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ చిత్ర కథ లండన్, హైదరాబాద్ నేపథ్యంలో జరుగుతుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. తమన్నా, సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్స్ కట్టిపడేసేలా కొత్తదనంతో ఉంటాయి. మా బ్యానర్ వాల్యూని రెట్టింపు చేసే మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామనే నమ్మకం మాకుంది..’’  అని అన్నారు. 

నటీనటులు:  తమన్నా భాటియా, సందీప్ కిషన్, నవదీప్, శరత్ బాబు, పూనమ్ కౌర్, లారిస్సా

సాంకేతిక నిపుణులు :

విడుదల : శ్రీ కృష్ణ క్రియేషన్స్. గౌరి కృష్ణ

దర్శకుడు: కునాల్ కోహ్లీ

నిర్మాతలు: రైనా జోషి, అక్షయ్ పూరి

సినిమాటోగ్రఫీ: మనీష్ చంద్ర భట్

సంగీతం: లియోన్ జేమ్స్

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి

ప్రొడక్షన్ డిజైన్: కిర్ స్టెన్ బ్రూక్  (UK)

డైలాగ్స్: గోపు కిషోర్ రెడ్డి

సౌండ్ డిజైన్: దారా సింగ్

అసోసియేట్ ప్రొడ్యూసర్ : సతీష్ సాల్వి, సంజన చోప్రా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : షాజహాన్, శివప్రసాద్ గుడిమిట్ల

Next Yenti Movie Latest Update:

Sri Krishna Creations Released Next Yenti Movie in Telugu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs