మురగదాస్ - విజయ్ కాంబినేషన్ వచ్చిన ‘సర్కార్’ ఎన్నో కాంట్రవర్సీస్ మధ్య విడుదల అయ్యి డివైడ్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తుంది. ఈ సినిమా తరువాత ఇళయదళపతి విజయ్ 63 వ చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టేశాడు. గతంలో విజయ్ తో ‘తేరి, మెర్సల్’ చిత్రాలు తీసి సక్సెస్ అందించిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీతో విజయ్ మరోసారి జతకట్టనున్నాడు.
స్టోరీ కూడా ఓకే అయిపోవడంతో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో ఈ సినిమా బిజీగా ఉంది. ఈ నేపధ్యంలో ఇందులో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ని తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట డైరెక్టర్ అట్లీ. నయనతార, సమంత ఇందులో నటించబోతున్నట్లు సమాచారం. విజయ్‌తో నయనతార గతంలో ‘విల్లు’ చిత్రంలో నటించింది. సమంత ‘తేరి, మెర్సల్’ చిత్రాల్లో నటించింది. ముచ్చటగా మూడోసారి విజయ్ తో నటించబోతోంది.
‘రాజారాణి’ తరువాత విజయ్ బ్యాక్ టు బ్యాక్ ‘తేరి, మెర్సల్’ వంటి సూపర్ హిట్ చిత్రాలు తీసిన అట్లీ మరోసారి విజయ్ ను డైరెక్ట్ చేసే అవకాశం రావడం మాములు విషయం కాదు. ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని విజయ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా లాంఛనంగా ప్రారంభించనున్నారు.