Advertisement
Google Ads BL

చిరు ఫస్ట్ సినిమా టైటిల్‌తో మూవీ.. రెడీ టు రిలీజ్


ప్రశాంత్, అవంతిక హీరో హీరోయిన్స్ గా నందమూరి తారకరత్న(NTR) ముఖ్య పాత్రలో యన్. ఎస్ క్రియేషన్స్ పతాకంపై పద్మప్రియ సమర్పణలో నల్లమోపు సుబ్బారెడ్డి నిర్మాతగా పి. ఎల్. కె . రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రాణం ఖరీదు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉంది. 

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రాణం ఖరీదు చిత్రం కథ వినగానే మా అందరికీ నచ్చి ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా అమెరికాలో 8 రోజులు మరియు హైదరాబాద్ 45 రోజులులలో షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి.. అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..’’ అని తెలిపారు.

దర్శకుడు పి.ఎల్.కె.రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా ‘ప్రాణం ఖరీదు’ చిత్రం అనుకున్నదాని కంటే ఔట్ పుట్ చాలా బాగా వచ్చింది. ఇంత బాగా రావడానికి కారణం అయిన మా హీరో ప్రశాంత్ కి, నందమూరి తారకరత్న గారికి, షఫి, జెమిని సురేష్, చిత్రం శ్రీను గారికి మరియు మిగతా ఆర్టిస్ట్స్‌లకు, టెక్నిషియన్స్‌కు చాలా థ్యాంక్స్. కథ విషయానికి వస్తే పూర్తి కమర్షియల్ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథని తీసుకొని కొత్తగా మలచటం జరిగింది. మా ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకులకు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము. మా ప్రయత్నం అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. ఈ చిత్రానికి వందేమాతరం ఇచ్చిన మ్యూజిక్ మరియు మహిరామ్స్ (హరి) ఇచ్చిన ఆర్.ఆర్  ఈ చిత్రానికి మరో హైలైట్ అవుతుంది. ఈ సందర్భంగా వందేమాతరం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీడియా సపోర్ట్ ప్రాణం ఖరీదు మూవీకి ఉండాలి అని కోరుకుంటున్నాము’’ అని తెలిపారు.

నటీనటులు ప్రశాంత్, అవంతిక, నందమూరి తారకరత్న, షఫి, జెమినీ సురేష్ ,చిత్రం శ్రీను, ఫణి రాజమౌళి( జబర్దస్త్ ఫేమ్), సంజన తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా మెన్ : మురళి మోహన్ రెడ్డి, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, మాటలు: మారుధూరి రాజా, పి.ఆర్.ఓ: కడలి రాంబాబు, నిర్మాత: నల్లమోపు సుబ్బారెడ్డి, దర్శకత్వం: పి.ఎల్.కె. రెడ్డి.

Movie on Chiranjeevi First Film Title:

Pranam Kharidu Movie Ready to Release 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs