Advertisement
Google Ads BL

ఇలియానా తీరుతో వైట్ల ఫీలయ్యాడా లేక షాకా?


టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సమయంలో.. టాలీవుడ్‌పై హాట్ హాట్ కామెంట్స్ చేసి మరీ బాలీవుడ్ చెక్కేసిన ఇలియానా.. తిరిగి టాలీవుడ్‌కి తిరుగు టపా కట్టేసింది. రవితేజ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంథోని’ చిత్రంతో మళ్లీ టాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రం నవంబర్ 16న విడుదల కాబోతోంది. అయితే చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇలియానా, ‘ఏఏఏ’కి సంబంధించి శ్రీను వైట్ల సీక్రెట్‌గా ఉంచాలనుకున్న విషయాన్ని మీడియాకి చెప్పేసి.. శ్రీనువైట్లకు షాకిచ్చింది.

Advertisement
CJ Advs

‘అమర్ అక్బర్ ఆంథోని’ చిత్రంతో టాలీవుడ్‌‌లోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాకి నేనే స్వయంగా డబ్బింగ్ చెప్పడం జరిగింది. నాకు తెలుగు రాదు.. కానీ శ్రీను వైట్ల నాతో డబ్బింగ్ చెప్పించారు. దీనికి ఆయన ఇచ్చిన సహకారం మరచిపోలేను. తెరపై నా వాయిస్ ఎలా ఉంటుందో చూసుకోవాలని ఎంతో కోరికగా ఉంది. అలాగే ఈ సినిమాలో ఇంకో విశేషం కూడా ఉంది. ఈ సినిమాలో రవి సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తారు. ఆ సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది.. అని ఇలియానా తెలిపింది.

అయితే రవితేజ సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తాడనే విషయం సినిమా రిలీజ్ వరకు చెప్పకుండా.. ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయాలని చూసిన శ్రీను వైట్ల.. ఆ విషయాన్ని ఇలియానా బయటికి చెప్పేయడంతో ఫీల్ అవ్వడంతో పాటు షాక్ కూడా అయ్యాడని అంటున్నారు. ఇలియానా ఇలా చెప్పేయడంతో చేసేది లేక తనలో తనే బాధపడినట్లుగా టాక్.

Srinu Vaitla Shocked with Ileana Speech:

Ileana Revealed Amar Akbar antony Secret
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs