Advertisement
Google Ads BL

ఆమెతో డేటింగ్ నిజమే.. హీరో క్లారిటీ!!


ఈ మధ్య టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా.. నటులు, నటీమణులు.. వారివారి సహచరులను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం వంటివి జరిగిపోతున్నాయి. టాలీవుడ్‌లో మహేష్ బాబు ఇప్పటికీ ఈ సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్ అంటే అతిశయోక్తి కాదు. ఇప్పడు బాలీవుడ్‌లో ఈ కల్చర్ బాగా పెరిగిపోతోంది. రణవీర్ సింగ్, దీపికా పదుకునెలే దీనికి ఉదాహరణ. ఈ జంట ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు మరోజంట అదేబాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. అవ్వడం ఏమిటీ ఆల్రెడీ అయిపోయామని కూడా వారు పబ్లిగ్గా చెప్పేశారు.

Advertisement
CJ Advs

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, డిజైనర్ నటాషా దలాల్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ తాజాగా ఓ షోలో చెప్పేశాడు. వాస్తవానికి వీరిద్దరిపై ఎప్పటి నుంచో బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి తిరుగుతున్న ఫొటోలు కూడా ఈ మధ్య నెట్లో బాగానే హల్‌చల్ చేస్తున్నాయి. ఇక వాళ్లు, వీళ్లు అనుకోవడం ఎందుకని భావించాడో ఏమో.. గానీ.. నిర్మాత కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో అసలు విషయం బయటపెట్టేశాడు వరుణ్.

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ ప్రసారం కావాల్సి ఉంది. ఈ షో‌కి సంబంధించిన ప్రోమోస్‌లో వరుణ్..‘అవును.. ఆమెతో డేటింగ్‌లో ఉన్నా. మేమిద్దరం ప్రేమికులం. ఆమెను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నా. త్వరలోనే ఆ వార్త చెబుతాను’ అని తెలిపాడు. అయితే ఇంతకు ముందు మీడియా గుచ్చి గుచ్చి అడిగినా కూడా చెప్పని వరుణ్ ధావన్.. ఈ షోలో మాత్రం నటాషా గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. మొత్తానికి రణవీర్, దీపికాల పెళ్లి తర్వాత మరో జంట పెళ్లికి రెడీ అవుతుందన్నమాట. 

Hero Clarity on Dating with Designer:

Varun Dhawan Revealed His Personal Secret
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs