Advertisement
Google Ads BL

షాక్: పబ్లిగ్గా కాజల్‌కి ముద్దు పెట్టేశాడు!!


ఇప్పుడు అన్ని భాషల ఇండస్ట్రీస్‌లో మీ టూ అంటూ హీరోయిన్స్ ఎంతగా గోల గోల చేస్తున్నారో తెలిసిందే. రోజుకో హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా మీ టూ గురించి ఫైర్ అవుతున్న ఈ సమయంలో ఒక కెమెరామ్యాన్ హీరోయిన్ ని బహిరంగంగా హగ్ చేసుకుని కిస్ పెడితే.... దానికి హీరోయిన్ షాకైతే... ఎలా ఉంటుందో అనేది తాజాగా జరిగిన కవచం టీజర్ లాంచ్ వేడుకలో చూడొచ్చు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న కవచం సినిమా టీజర్ ని లాంచ్ చేసింది చిత్ర బృందం. ఆ వేడుకకి సినిమా టెక్నీకల్ టీం దగ్గర నుండి దర్శకుడు హీరో, కాజల్, మెహ్రీన్ లు పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

అయితే టీజర్ లాంచ్ వేదిక మీద కాజల్ మాట్లాడుతూ హీరో గురించి కో స్టార్ మెహ్రీన్ గురించి మాట్లాడిన తర్వాత సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కెమెరా గురించి కాజల్ పొగుడుతున్న సందర్భంలో ఉన్నట్టుండి చోటా కె నాయుడు కాజల్ ని హగ్ చేసుకుని.... ముద్దు పెడితే..అక్కడ కాజల్ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. నిజంగానే అనుకోని ఆ ఘటనపై కాజల్ ముందు షాకయినా తర్వాత తేరుకుని మ‌న ఫ్యామిలీనే క‌దా.... చ‌ల్తా అంటూ నవ్వేసింది. కానీ అలా ఒక కెమెరా మ్యాన్ బహిరంగంగా హీరోయిన్‌కి ముద్దు పెట్టడం ఇంతవరకు జరగలేదు. సెట్స్ లో అందరూ ఆలింగనాలు  చేసుకుని వర్క్ స్టార్ట్ చేయడం అనేది కామన్.

కానీ ఇలా ఒక వేడుక మీద మీడియా అంతా చూస్తుండగా హగ్గు, ముద్దు అనేవి కాస్త వింతే. అదే బాలీవుడ్ లో అయితే ఏం పట్టించుకోరు కానీ... టాలీవుడ్ లో మాత్రం మీడియాతో పాటుగా ప్రేక్షకులు  వింతగా చూస్తారు. అసలు ప్రేక్షకులు మీడియా వరకు ఎందుకండీ.. ఆ హఠాత్పరిణామానికి వేదికపై ఉన్న కవచం బృందమే షాకైంది. ఇక మెహ్రీన్ అయితే షాక్ లోనే అలా చూస్తుండిపోయింది. 

Chota K Naidu Kissed Kajal at Kavacham Teaser Launch:

Chota K  Naidu Kiss Kajal.. Sensation in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs