Advertisement
Google Ads BL

టాక్సీవాలాకి నయనతారకి లింకేంటి..?


విజయ్ దేవరకొండ  న్యూ మూవీ టాక్సీవాలా సినిమా రేపు 17 న విడుదలవుతున్న సందర్భంగా ఆ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది టాక్సీవాలా టీం. అయితే టాక్సీవాలా ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ.... ఇప్పుడు టాక్సీవాలా మీద కొన్ని సెటైర్స్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్నాయి.  ఇప్పటికే విడుదల కష్టాలు ఎదుర్కొని.. సినిమా మొత్తం లీకైన టాక్సీవాలా మీద ప్రేక్షకుల్లో హైప్ పెంచేందుకు విజయ్ దేవరకొండ నానా తిప్పలు పడుతుంటే.. ఇప్పుడు వినబడుతున్న రూమర్ చూస్తుంటే ఈ సినిమా మీద అంచనాలు తగ్గిపోయేలా ఉంది. నిన్న విడుదలైన టీజర్ లో ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న విజయ్ ఫ్రెండ్స్ ఇచ్చిన సలహా మేరకు ఒక పాత వింటేజ్ కారు కొనుక్కుంటాడు. ఆ కారుతో ఎంతోకొంత సంపాదించి సమస్యల నుండి బయటపడొచ్చనేది అతని ఉద్దేశ్యం.

Advertisement
CJ Advs

అయితే ఆ కారులో దెయ్యం ఉంటుంది. ఆ కారులోని దెయ్యం అందరిని భయపెడుతోంది. మరి ఈ టాక్సీవాలా కథతో ఇప్పుడు నయనతార గతంలో తమిళంలో నటించిన డోరా కథతో ముడిపెడుతున్నారు కొందరు. టాక్సీవాలా కథ, నయనతార డోరా కథ ఒకేలా ఉన్నాయని.... డోరాలో కూడా నయనతార ఒక కారు కొనుక్కుంటే.... ఆ కారులో మరణించిన చిన్న పాప ఆత్మ... తనని చంపిన వారి మీద పగ తీర్చుకోవడానికి చూడడం, దానికి నయనతార హెల్ప్ చెయ్యడం జరుగుతుంది. మరి నిన్న టాక్సీవాలా ట్రైలర్ లో కూడా విజయ్ కొన్న కారులో దెయ్యం కాన్సెప్ట్ చూస్తుంటే అది... డోరా కథతో మ్యాచ్ అవుతుందని అంటున్నారు.

మరి విజయ్ డోరా సినిమాని కాపీ కొట్టి కొత్తగా చేశాడా? అనే అనుమానాలు ఇప్పుడు ఫిలింనగర్ లో మొదలయ్యాయి. కొత్త దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ డోరాని కాపీ కొట్టాడా? లేదంటే అతను ఆ సినిమా చూడకుండా ఈ కథను ప్రిపేర్ చేశాడా? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ రేజ్ అయ్యాయి.

Taxiwala Compared with Nayanthara Film:

Taxiwala Story related to Nayanthara Dora
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs