నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ముద్ర. ఈ చిత్రాన్ని డిసెంబర్ 28న విడుదల చేయనున్నారు చిత్ర యూనిట్. వాస్తవిక సంఘటనల ఆధారంగా జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను ఎలా మీడియా పరిష్కరిస్తుంది.. అందులో మీడియా బాధ్యతను గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు టిఎన్ సంతోష్. ముద్ర సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది.. అదే సమయంలో డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు యూనిట్. తొలిసారి ఇందులో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు. అతడి బర్త్ డే కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో జర్నలిస్ట్ అర్జున్ సురవరంగా నటిస్తున్నారు నిఖిల్. లావణ్య త్రిపాఠి తొలిసారి నిఖిల్ తో జోడీకట్టింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా మరియు రాజా రవీంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి మరియు మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పి సంస్థలపై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ ముద్ర సినిమాను నిర్మిస్తున్నారు. బి మధు ఈ చిత్రానికి సమర్పకుడిగా ఉన్నారు. డిసెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా ముద్ర సినిమా విడుదల కానుంది.
నటీనటులు:
నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర
సాంకేతిన నిపుణులు: కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: టిఎన్ సంతోష్, సమర్పకుడు: బి మధు, నిర్మాతలు: కావ్య వేణుగోపాల్ మరియు రాజ్ కుమార్, నిర్మాణ సంస్థలు: ఔరా సినిమాస్ పివిటి మరియు మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పి, సినిమాటోగ్రఫీ: సూర్య, సంగీతం: స‌్యామ్ సిఎస్, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్, ఫైట్స్: వెంకట్, క్యాస్ట్యూమ్ డిజైనర్: రాగా రెడ్డి, డైరెక్షన్ డిపార్ట్ మెంట్: రమా రమేష్, రంగనాథ్, లోకేష్, భరత్, అరు, బ్రహ్మ, పబ్లిసిటీ డిజైన్: అనిల్-భాను, పిఆర్ఓ: వంశీ శేఖర్