కమెడియన్ సునీల్ కి మంచి పేరు వచ్చిన చిత్రాల్లో 'సొంతం' ఒకటి. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల దర్శకత్వం చేశారు. సునీల్ కి 'సొంతం' నుండి 'రెడీ' వరకు అన్ని సినిమాల్లో శ్రీను మంచి పాత్రలే ఇచ్చాడు. అవి సక్సెస్ కూడా అయ్యాయి. ఈ సినిమాల తరువాత సునీల్ హీరో గా కెరీర్ ని స్టార్ట్ చేసి 'సిల్లీ ఫెలోస్' తో హీరో పాత్రలకి ఫుల్ స్టాప్ పెట్టాడు. మళ్లీ చాలాకాలం తరువాత తన ఫ్రెండ్ దర్శకత్వం వహించిన ‘అరవింద సమేత’ తో కమెడియన్ గా రీఎంట్రీ ఇస్తాడంటే అందులో కామెడీ చేసే అంత సీన్స్ ఇవ్వలేదు త్రివిక్రమ్.
దాంతో సునీల్ ఫ్యాన్స్ డల్ అయ్యారు. ఇప్పుడు రవితేజతో నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ తన ఆశ నెరవేరడమే కాదు తన ఫ్యాన్స్ కోరిక కూడా తీర్చనున్నాడు. శ్రీను వైట్ల సునీల్ కి ఇందులో ఫెంటాస్టిక్ క్యారెక్టర్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇందులో సునీల్ బాబీ అనే పాత్రలో నటించాడు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ ‘బాబీ… అప్పులు చేయడం అతని హాబీ’ అని ఆ పాత్ర గురించి రెండు ముక్కలు చెప్పింది. సునీల్ అమెరికాలో షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఈ ఈవెంట్ కు అటెండ్ అవ్వలేకపోయాడు.
మరి ఈ సినిమాతో సునీల్ ఎంత నవ్విస్తాడో చూడాలి. ఓ ఇంటర్వ్యూలో శ్రీను వైట్ల సునీల్ పాత్ర గురించి మాట్లాడుతూ.. ఇందులో సునీల్ చాలా మంచి పాత్ర చేశాడని.. ఆడియన్స్ ని తెగ నవ్వించేస్తాడు అని చెప్పాడు. దాంతో అతని పాత్రపై అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాపై రవితేజ.. శ్రీను వైట్ల హోప్స్ పెట్టుకున్నారు. ఇద్దరికి ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం.