రామ్ చరణ్ - బోయపాటి కాంబోలో పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వినయ విధేయరామ’. రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడో అనుకుంటే.. ‘రంగస్థలం’ సినిమా విడుదల కాకముందే మెగాస్టార్ చిరు, రామ్ చరణ్ ని బోయపాటి డైరెక్షన్‌లో నటించమని చెప్పడం.. అలా ఆ కాంబో సెట్ కావడం జరిగాయి. అయితే ‘రంగస్థలం’ సినిమా చిరు అండ్ చరణ్ అనుకున్నట్టుగా కాకుండా సూపర్ హిట్ అయ్యింది. అయితే ‘రంగస్థలం’ సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్, బోయపాటి సినిమా షూటింగ్ కి రాలేదు. ముందునుండి బోయపాటి సినిమా మీద చరణ్ కి పెద్దగా నమ్మకం లేదు అనే వార్తలు కూడా వినిపించాయి.
కానీ చిరు... బోయపాటితో చేస్తేనే హీరోయిజం పర్ఫెక్ట్ గా బయటికొస్తుందని... మాస్ తోనే అభిమాన గణాన్ని పెంచుకోవచ్చని చెప్పడంతో చరణ్.. బోయపాటితో కమిట్ అయ్యాడు. అయితే బోయపాటి ఇంతవరకు తాను తెరకెక్కించిన సినిమాల కన్నా ఓ మోస్తారు ఎక్కువగానే ఈ వినయ విధేయ రామలో మాస్ అండ్ యాక్షన్ ని నింపేసాడు. తాజాగా విడుదలైన వినయ విధేయ రామ టైటిల్ అయితే సాఫ్ట్ గా ఉంది కానీ టీజర్ మాత్రం ఊర మాస్ లెక్కుంది. పక్కా మాస్ ఎలిమెంట్స్ కూడిన ఆ యాక్షన్ టీజర్ ని చూసి మెగా అభిమానులైతే ఆనంద పడ్డారు కానీ... మిగతా ప్రేక్షకులు రొటీన్ అంటూ పెదవి విరిచారు.
ఇక సినిమా టీజర్ విడుదలైన 24 గంటల్లో సై రా టీజర్ వ్యూస్ ని క్రాస్ చేసిందని అన్నారు. వినయ విధేయ రామ 24 గంటల్లో 15 మిలియన్ల డిజిటల్ వ్యూస్‌ని సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందమే అధికారికంగా ప్రకటించింది. 24 గంటల్లో 15 మిలియన్ల వ్యూస్ అంటే.. గొప్ప విషయమే. మరి వినయ విధేయ రామ 15 మిలియన్ల వ్యూస్ సాధించింది ఓకే... కానీ... వినయ విధేయ రామ ట్రేండింగ్ లో ఉండాలి కదా.... కానీ టాప్ 10లో ఎక్కడా వినయ విధేయ రామ ట్రెండింగ్ లో కనిపించడం లేదు. మరి 24 గంటల్లో 15 మిలియన్ వ్యూస్ సంపాదించిన వినయ విధేయ రామ ఖచ్చితంగా టాప్ 2 లోనో, 3 లో ఉండాలి కానీ... ఇలా టాప్ 10 లో కనబడకపోయేసరికి చాలామందికి వినయ విధేయరామ సాధించిన వ్యూస్ మీద అనుమానాలు మొదలైనాయి.