Advertisement
Google Ads BL

టాక్ వీకైనా.. విజయ్‌కి ఇలా కలిసొస్తుందంతే..!


ప్రస్తుతం విజయ్ సర్కార్ మూవీ తమిళనాట పెను సంచలనాలు సృష్టిస్తుంది. అదేదో సినిమా సూపర్ హిట్ అయ్యి రికార్డులు కొల్లగొట్టడం... సంచలనాలు నమోదు చెయ్యడంతో... తమిళనాట అధికారంలో ఉన్న ప్రభుత్వం సర్కార్ సినిమా మీద తీవ్ర ఆరోపణలు చేస్తుంది. అలా సర్కార్ వివాదాల్లో చిక్కుకుంది. సర్కార్ సినిమా సూపర్ హిట్ అవలేదు. కానీ నెగెటివ్ టాక్ తోనే కలెక్షన్స్ కుమ్మేస్తుంది. ఇక ఇప్పుడు ఈ వివాదాలతో సినిమా మరింత గా పబ్లిసిటీ జరిగి కలెక్షన్స్ మరింతగా పెరగడం ఖాయం. అయితే విజయ్ కి ఇలా జరగడం కొత్తేమి కాదు.

Advertisement
CJ Advs

విజయ్ గత చిత్రం మెర్సల్ చిత్రం కూడా విడుదలైన మొదటి షోకి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా కలెక్షన్స్ రావన్న సమయంలో... బిజెపి ప్రభుత్వంతో పాటుగా డాక్టర్స్ అసోసిషియన్ అంతా కలిసి మెర్సల్ సినిమా వలన తమ పరువుకు భంగం కలుగుతుందని... నానా రచ్చ చేశారు. అలా మెర్సల్ కి ఫ్రీగా పబ్లిసిటీ చేసిపెట్టి మరీ అదిరిపోయే కలెక్షన్స్ వచ్చేలా చేశారు. మరి మెర్సల్ హిట్ అవకపోయినా... కలెక్షన్స్ మాత్రం అదుర్స్. మెర్సల్ కలెక్షన్స్ అంతగా రావడానికి కారణం ఆ చిత్రం వివాదాల్లో చిక్కుకోవడమే. మరి తాజాగా సర్కార్ చిత్రం కూడా వివాదాలకు కేరాఫ్ అయ్యింది.

మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కార్ సినిమాకి యావరేజ్ టాకే వచ్చింది. కానీ విజయ్ స్టామినా, మురుగ మీదున్న నమ్మకంతో ఈ సినిమా కలెక్షన్స్ అదిరిపోతున్న టైం లోనే.... సర్కార్ కూడా వివాదాల్లో చిక్కుకోవడంతో... ఆ కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం తమిళనాట సర్కార్ సినిమా విషయంలో జరిగే రచ్చతో సినిమా మీద మరింత ఆశక్తి జనాల్లో పెరుగుతుంది. అలా అనుకోకుండా సర్కార్ సినిమాకి కలెక్షన్స్ పెరిగి సూపర్ హిట్ అవడం ఖాయం అనేలా బాక్సాఫీస్ వద్ద చర్చలు జరగుతున్నాయి. మరి అనుకోకుండా విజయ్ కి వివాదాలు అలా కలిసొస్తున్నాయ్ అన్నమాట.

Vijay lucky with Controversy:

Vijay Sarkar Follows Mersal steps
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs