మెగా అభిమానులు ఎదురు చూసినంత సేపు లేదు వినయ విధేయ రామ్ టైటిల్ అండ్ లుక్ అండ్ టీజర్ రావడానికి. రామ్ చరణ్ లుక్ అండ్ టైటిల్ దీపావళి ముందు వదిలిన బోయపాటి.. దీపావళి అలా వెళ్లిందో లేదో ఇలా వినయ విధేయ రామ్ టీజర్ ని విడుదల చేసి మెగా అభిమానులను హ్యాపీ చేసాడు. మరి బోయపాటి టైటిల్స్ సాఫ్ట్ గా ఉన్నా అయన సినిమాల్లో మాస్ ఎలెమెంట్స్‌కి కొదవలేదనేది రామ్ చరణ్ వినయ విధేయ రామ్ ఫస్ట్ లుక్ లోనే తెలిసింది. మాస్ లుక్ లో రామ్ చరణ్ పరిగెత్తుకొస్తుంటే.. మాస్ కాదు బాబోయ్ ఊర మాస్ చరణ్ అన్నారు. ఇక ఫస్ట్ లుక్ ని టైటిల్ ని వదలడంతో లేట్ చేసినా... టీజర్ విషయంలో మాత్రం ఎటువంటి డిలే చెయ్యలేదు బోయపాటి... అనుకున్న టైం కి అనుకున్నట్టుగా టీజర్ వదిలేసాడు.
ఇక వినయ విధేయ రామ్ టీజర్ లో హీరోయిజాన్ని ఎంతగా చూపెట్టాలో అంతగా చూపెట్టేసాడు బోయపాటి. రామ్ చరణ్ విశ్వరూపాన్ని ఈ టీజర్ తో పరిచయం చేసాడు దర్శకుడు బోయపాటి. రామ్ చరణ్ ని చాలా స్టైలిష్ గా చూపిస్తూనే.. అందులోనే మాస్ ని దించేసాడు. వివేక్ ఒబెరాయ్ మాత్రం స్టైలిష్ విలన్ గా విలనిజాన్ని పండించబోతున్నాడనేది టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక చరణ్.... ‘‘అన్నా వీణ్ణి భయపెట్టాలా... చంపేయాలా... భయపెట్టడానికైతే పది నిమిషాలు.. చంపేయాలంటే పావు గంట. ఏదైనా ఓకే... సెలెక్ట్ చేసుకో’’ అంటూ చెప్పే మాస్ డైలాగ్ థియేటర్స్ లో విజిల్ వేయించడం ఖాయమంటున్నారు. ఇక ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లు కూడా ఈ టీజర్‌లో చరణ్ అన్నలుగా పరిచయమయ్యారు.
చరణ్ చేతిలో ఆయుధంతో.. మాస్ గా కనబడుతూనే మాస్ డైలాగ్ తో రెచ్చిపోయాడు. టీజర్ చివరిలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ అయితే మెగా ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి. రామ్ చరణ్ స్టైలిష్ గా ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లతో నడిచోస్తూ... ప్రశాంత్ దగ్గరనుండి ‘‘రేయ్ నువ్వు పందెం పరశురామ్ అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల’’ అంటూ చరణ్ బల్లగుద్దుతూ చెప్పిన డైలాగ్ అదిరింది అంతే. మరి ఈ టీజర్ మొత్తం బోయపాటి మార్క్ తోనే బయటికి వచ్చింది. హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ గాని... ఫ్యామిలీ డ్రామాను గాని టచ్ చేయకుండా.... కేవలం యాక్షన్ .. ఎమోషన్ మీదే టీజర్ కట్ చేశారు. ఇక కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ఒక లెవల్‌లో ఉండబోతుందనేది ఈ టీజర్ చూస్తుంటే తెలిసిపోతుంది.