Advertisement
Google Ads BL

మెగా హీరోల దీవాళి పిక్‌ అదిరిందిగా!!


మెగాభిమానులందరికి ఆ ఫ్యామిలీ హీరోలంటే ఎంతో ఇష్టం. అంతేకాదు... వారికి కేవలం మెగాభిమానులే కాదు.. వ్యక్తిగతంగా కూడా పలువురు అభిమానులు ఉన్నారు. ఎవరి శైలిలో వారు తమ తమ కెరీర్స్‌లో దూసుకుపోతున్నారు. వీరు తమ తమ కెరీర్స్‌పరంగా ఎంతో బిజీ బిజీ లైఫ్‌లను గడుపుతూ ఉంటారు. కానీ వీరు తమ మధ్య బంధాలు, అనుబంధాలకు మాత్రం ఎంతో ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. నేటిరోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కష్టమే అయినా ఏదైనా వేడుకలు, పండుగలు, పబ్బాలు, పెద్దల జన్మదినోత్సవాలు సందర్భంగా మాత్రం అందరు కలిసి కట్టుగా కలిసి ఉంటూ అందరికీ సంతోషాన్ని కలిగించడమే కాదు.. తామందరం కెరీర్స్‌ పరంగా ఎంత పోటీ ఉన్నా అందరం ఒకటే అనే విషయాన్ని అభిమానులకు చెబుతూ ఉంటారు. 

Advertisement
CJ Advs

గతంలో పవన్‌, బన్నీ అభిమానుల మధ్య కాస్త వైరం వచ్చినా అవి కలకాలం కాదని, అవి నీటిపై బుడగల వంటివేనని నిరూపిస్తూ ఉంటారు. చిరంజీవి బర్త్‌డేల సందర్భంగానే కాదు.. పవన్‌కళ్యాణ్‌కి తమవంతు మద్దతు తెలపడం, పవన్‌ మాటకి కట్టుబడి రామ్‌చరణ్‌ వంటి వారు తిత్లీ తుపాన్‌ వల్ల నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాలోని గ్రామాలను దత్తత తీసుకోవడం వంటివి వీటికి కొన్ని ఉదాహరణలు. ఇక క్రిస్మస్‌ వేడుకలను చేసుకోవడమే కాదు.. ఇటీవల వింత వేషధారణలతో కూడా కలసి ఓ వేడుకను వీరు జరుపుకున్నారు. 

తాజాగా దీపావళి పండుగ సందర్భంగా మెగా హీరోలు వారి సతీమణులు అందరు కలిసి పండుగను జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మెగా కోడలు, రామ్‌చరణ్‌ శ్రీమతి ఉపాసన ట్విట్టర్‌ వేదిక ద్వారా పలువురితో పంచుకుంది. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. చిరంజీవితో పాటు అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌, కళ్యాణ్‌దేవ్‌, వరుణ్‌తేజ్‌, నాగబాబు, అల్లుశిరీష్‌, సాయిధరమ్‌తేజ్‌లు ఈ వేడుక సందర్భంగా ఒక చోటికి చేరారు. వారి వారి సతీమణులు కూడా ఈ వేడుకలో భాగస్వాములు అయ్యారు. సురేఖ, శ్రీజ, ఉపాసన, నిహారిక, స్నేహారెడ్డి తదితరులు టపాసులు కాలుస్తూ సందడి చేశారు. ఇందులో రాజకీయ పర్యటనల్లో బిజీగా ఉన్న పవన్‌ మాత్రం లేకపోవడం కాస్త నిరుత్సాహపరిచేదే అయినా మిగిలిన అందరి ఫొటోలను చూసి మెగాభిమానులు అనందంలో తేలియాడుతున్నారు.

Mega Family in Diwali Celebrations:

Total mega Family celebrates diwali at Chiranjeevi house
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs