Advertisement
Google Ads BL

ఇలియానా ఫస్ట్ టైమ్ టాలీవుడ్‌లో అలా చేస్తోంది!


‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఇలియానా..!!

Advertisement
CJ Advs

మాస్ మహా రాజా రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా ఈ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది...ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న ఇలియానా తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పగా, తెలుగులో డబ్బింగ్ చెప్పడం ఆమెకు ఇదే మొదటిసారి.. పాత్ర డిమాండ్ చేయడంతో ఇలియానా  పాత్రకు తనతోనే డబ్బింగ్ చెప్పించాలని శ్రీనువైట్ల ఇలా ప్లాన్ చేయగా నాలుగు రోజుల్లోనే ఇలియానా తన డబ్బింగ్ పార్ట్ ని పూర్తి చేయడం విశేషం.. రవితేజ హీరోగా నటిస్తుండగా.. రవితేజతో, ఇలియానాకి ఇది నాలుగో సినిమా.. ఇప్పటికే ఈ కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది దాంతో సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్ నవంబర్ 10 న ఎంతో గ్రాండ్ గా జరగనుంది.. నవంబర్ 16 న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

తారాగణం: రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్,విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు.. 

సాంకేతిక నిపుణులు : స్క్రీన్ ప్లే , డైలాగ్స్ మరియు దర్శకత్వం : శ్రీను వైట్ల, కథ :  శ్రీనువైట్ల, వంశీ రాజేష్ కొండవీటి, నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (CVM), సహ నిర్మాత: ప్రవీణ్ మార్పురి, సీఈఓ : చెర్రీ, డీఓపీ : వెంకట్ సి దిలీప్, సంగీతం: ఎస్ఎస్ థమన్, ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ, ఆర్ట్ డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్, PRO : వంశీ-శేఖర్

First Time Ileana for ‘Amar Akbar Anthony’ :

Ileana dubs in Telugu for ‘Amar Akbar Anthony’
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs