Advertisement
Google Ads BL

మహేష్‌బాబు బ్యానర్ కోసం నమ్రత బిజీబిజీ!


మహేష్ బాబు నటుడు గానే కాకుండా వ్యాపారాలు..యాడ్ ఫిల్మ్ లు, బ్రాండ్ ఎండోర్స్ మెంట్ లు వంటివి చేస్తుంటాడనేది అందరికీ తెల్సిన విషయమే. రీసెంట్ గా అయన ‘ఎంబి’ అనే బ్యానర్ స్టార్ట్ చేసి అందులో సినిమాలు చేయాలనీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ బ్యానర్ లో తన సినిమాలే కాకుండా చిన్న సినిమాలు కూడా తెరకెక్కించాలని మహేష్ ప్లాన్ అంట.

Advertisement
CJ Advs

మహేష్ తన సినిమాల్లో బిజీగా అయిపోతాడు కాబట్టి ఆ పనులు తన భార్య నమ్రత చూసుకుంటుందట. ఇకపై చిన్న సినిమాలు, డిఫరెంట్ సినిమాలు నిర్మించాలని ఆలోచిస్తున్నారట. సరైన కథలు..కాస్త ప్రామిసింగ్ గా వుండే చిన్న డైరక్టర్ల కోసం చూస్తున్నారు. రెండు మూడు కోట్లు లోపు అయిపోయే సినిమాలను తెరకెక్కించాలనే ప్లాన్‌తో ఉన్నట్లుగా సమాచారం. దీని కోసం డైరెక్టర్స్‌ను సెలెక్ట్ చేసే పనిలో ఉంది ‘ఎంబి’ బ్యానర్ టీమ్. రీసెంట్ గా వచ్చిన ఆర్ఎక్స్ 100, యుటర్న్, చిలసౌ వంటి చిత్రాలు నమ్రతకి బాగా నచ్చడంతో.. ఆ సినిమాలను రూపొందించిన దర్శకులతో సినిమాలు చేయాలనీ నమ్రత డెసిషన్ తీసుకున్నట్లుగా టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

వీరికి సపోర్ట్ గా..అల్లు అరవింద్..దిల్ రాజు..యూవీ క్రియేషన్స్ వారు ఉన్నారు. పైగా స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు అయిన ఏషియన్, దిల్ రాజు వంటి వారితో మంచి సంబంధాలు వున్నాయి. సో అన్ని సరిగా ప్లాన్ చేసుకుంటే ఈ ఫీల్డ్ లో సక్సెస్ అవ్వొచ్చు.  ప్రస్తుతం నమ్రత కొంతమంది దర్శకులు చెప్పే కథలు వింటున్నట్టు సమాచారం.

Namrata Shirodkar Busy for MB Banner:

Namrata Shirodkar Searching for Directors to MB Banner
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs