Advertisement
Google Ads BL

అర్జెంట్‌గా హిట్టు పడితేనే.. లేదంటే అవుట్!


మహానటికి ముందు అజ్ఞాతవాసి సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న కీర్తి సురేష్... మహానటి తర్వాత కూడా డిజాస్టర్స్ అందుకుంటూనే ఉంది. విక్రమ్ తో చేసిన సామి స్క్వేర్ డిజాస్టర్ గా నిలవగా.... విశాల్ తో కలిసి నటించిన పందెం కోడి 2 కూడా యావరేజ్ గానే మిగిలింది. సామి స్క్వేర్ లో కీర్తి సురేష్ కాస్త ఎబ్బెట్టుగా కనిపించి ఇబ్బంది పెట్టింది. ఇక పందెం కోడి లో కూడా కీర్తి నటనకు ఓ అన్నంత మార్కులేమి పడలేదు. ఇక కీర్తి సురేష్ ఆశలు పెట్టుకున్న మురుగదాస్ సర్కార్ మూవీ కూడా కీర్తి సురేష్ ని ముంచేసింది. 

Advertisement
CJ Advs

విజయ్ - మురుగదాస్ కాంబోలో మూడో సినిమాగా తెరకెక్కిన సర్కార్ సినిమా మంగళవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఏమాత్రం ప్రమోషన్స్ లేని ఈ సినిమా విడుదలైన మొదటి షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. విజయ్ ఓవరేక్షన్ తో సినిమా మొత్తం తమిళ నేటివిటీ తో నిండిపోయిందని టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ పాత్రకి ఈ సినిమాలో అసలు ప్రాధాన్యతే లేదు. విజయ్ కి మరదలుగా... ఓ ఎమ్.ఎల్.ఏ కూతురి పాత్రలో నటించిన హీరోయిన్ కీర్తి సురేష్ కి పెద్దగా స్క్రీన్ టైం లేకపోయినా.. ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది. 

అయితే మహానటి వంటి సినిమాలో నటించి అందరి మన్ననలు పొందిన..  కీర్తి పాత్ర‌ల ఎంపిక విష‌యంలో చాలా శ్ర‌ద్ద తీసుకోవాలి. అస‌లేమాత్రం గుర్తింపు లేని ఇలాంటి సినిమాలు చేయ‌డం వ‌ల్ల త‌న‌కు వ‌చ్చే లాభం ఏమిట‌న్న‌ది త‌నే ప్ర‌శ్నించుకోవాలి. ఇక ఈ సినిమా ఫలితం దెబ్బకి కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పడిపోవడం ఖాయం. టాలీవుడ్ లో అవకాశాలు లేని కీర్తికి సర్కార్ దెబ్బకి కోలీవుడ్ లో కూడా గడ్డుకాలం వచ్చినా రావొచ్చు. పాపం కీర్తి సురేష్... ఎంత తొందరగా గుర్తింపు తెచ్చుకుందో.. అంతే తొందరగా ఫెడవుట్ అయ్యేలా కనబడుతుంది.

One More flop to Keerthi Suresh:

Heroine Keerthi Suresh Wants Big Hit
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs