Advertisement
Google Ads BL

మహేష్‌కి.. ‘2.O’ టీమ్ కృతజ్ఞతలు తెలిపారు


కోలీవుడ్‌లో మురుగదాస్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘సర్కార్‌’ చిత్రానికి అనుకున్న స్థాయిలో టాక్‌ రాలేదు. దీంతో మురుగదాస్‌కి ‘ఎస్‌’తో ప్రారంభమయ్యే టైటిల్స్‌ కలిసి రావడం లేదని నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. ‘సెవెన్త్‌సెన్స్‌, స్టాలిన్‌, స్పైడర్‌, ఇప్పుడు సర్కార్‌’ వంటి చిత్రాలు నిరాశపరచడమే దీనికి కారణం. ఇదే సమయంలో దక్షిణాది నుంచి వస్తోన్న మరో భారీ చిత్రం ‘2.ఓ’ మీద అందరి దృష్టి నిలిచింది. శంకర్‌ గత చిత్రం ‘ఐ’ పెద్దగా ప్రభావం చూపలేదు. మరి ‘2.ఓ’తో అయినా ‘బాహుబలి’ రికార్డులను చిట్టి బద్దలు కొడతాడా? షరా మామూలుగా ఎన్నో అంచనాలతో వచ్చి నిరాశపరుస్తాడా? అనే అనుమానాలు కూడా కొందరిలో ఉన్నాయి. 

Advertisement
CJ Advs

ఇక ‘2.ఓ’ ట్రైలర్‌ని చూస్తే కేవలం ఆయన కథ కంటే విజువల్‌ ఎఫెక్ట్స్‌ మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడా? అనే అనుమానం వస్తోంది. అయితే ఈ చిత్రం ట్రైలర్‌కి మాత్రం అద్భుతమైన స్పందన లభిస్తూ ఉండటం విశేషం. తాజాగా మహేష్‌ బాబు ‘విజువల్స్‌, కాన్సెప్ట్‌ అదిరిపోయాయి. చిట్టి చేసే విధ్యంసాలను తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. శంకర్ సార్‌, రజనీసార్‌, అక్షయ్‌కుమార్‌, ఏఆర్‌రెహ్మాన్‌ ... ఇలా మీ టీమ్‌ మొత్తానికి నా అభినందనలు’’ అని ట్వీట్‌ చేశాడు. ఇటీవల విడుదలైన ‘2.ఓ’ చిత్రం ట్రైలర్‌ చూసి ఫిదా అయిపోయి మహేష్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. సినీ అభిమానులు ఈ చిత్రం గురించి ఎంతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో మరోవైపు అంతకంటే వారు ఊహించిన దాని కంటే విజువల్‌ ఎఫెక్ట్స్‌ ట్రైలర్‌లో కనిపించడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

ఇక మహేష్‌ ట్వీట్‌పై ‘2.ఓ’లో ప్రతినాయకునిగా నటించిన అక్షయ్‌కుమార్‌ స్పందించాడు. మహేష్‌ ట్వీట్‌ని రీట్వీట్‌ చేసిన ఆయన మహేష్‌కి కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే డైరెక్టర్ శంకర్ కూడా మహేష్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. వీరితో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా థ్యాంక్యూ మహేష్ బాబూ.. అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం ఈనెల 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ‘బాహుబలి’తో పోటీ అని భావించిన చిత్రాలేవీ సరిగా ఆడకపోతూ ఉండటం అనే సెంటిమెంట్‌ ఈమద్య బాగా నిరూపితం అవుతోంది. మరి ఈ సెంటిమెంట్‌ని శంకర్‌ తన స్టామినాతో బ్రేక్‌ చేస్తాడో లేదో చూడాల్సివుంది...! 

Mahesh Babu Praises 2.O Trailer :

2.O team Says Thanks to Super Star MahesH Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs