Advertisement
Google Ads BL

బాలల చిత్రమే కానీ ‘అంతా విచిత్రం’


అయాన్ ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వరావు (కన్నారావు) ఆశీస్సులతో.. ఎర్రోజు వెంకటాచారి సమర్పణలో మహ్మద్ అస్లాం నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం ‘అంతా విచిత్రం’. జి. శ్రీను గౌడ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జై రామ్‌కుమార్ దర్శకుడు. సాయి ప్రణీత్, లిఖిత్, బిట్టు, నీరజ్, రాజేంద్ర, విజయ్ భాస్కర్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి భోలే షావలి సంగీతం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. బాలల దినోత్సవం (నవంబర్ 14) సందర్భంగా ఎం.జి.ఎం ద్వారా ఈనెల 10న ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement
CJ Advs

 ప్రముఖ హాస్య కథానాయకుడు అలీతో ‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తీసిన జై రామ్‌కుమార్ ‘అంతా విచిత్రం’ చిత్రాన్ని వినూత్నమైన కథాంశంతో తెరకెక్కించారు. ఈ చిత్రం చూసి ఎంతో ఇంప్రెస్ అయిన ఎం.జి.ఎం మూవీస్ అధినేత ఎం. అచ్చిబాబు.. రెండు రాష్ట్రాల్లోనూ తనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంగీత దర్శకులు భోలె షావలి, విలన్ పాత్రధారి సాయి ప్రణీత్, ఆటా ఫైవ్ బిట్టూ, సమంత పాత్రధారి రేవతి, జూనియర్ ఎన్టీఆర్ పాత్రధారి లిఖిత్, పవన్ కళ్యాణ్ పాత్రధారి సాయి నీరజ్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ వంటి సూపర్ హీరోల అభిమానులు అయి ఉండి, వాళ్ళను నిజ జీవితంలో అనుకరిస్తుండే కొందరు చిన్న కుర్రాళ్ళు.. అందరూ తమ గురించి ఎలా విచిత్రంగా చెప్పుకునేలా చేశారు.. అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఇషికావర్మ, రేవతి కళ్యాణ్, సమ్రీన్, కావేరి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

Anthaa Vichitram Movie Ready to Release:

Anthaa Vichitram Movie Release date pix
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs