Advertisement
Google Ads BL

విశాల్‌తో లవ్.. అసలు విషయం చెప్పేసింది!


వరలక్ష్మి శరత్‌కుమార్‌.. స్టార్‌హీరో, పొలిటీషియన్‌ అయిన శరత్‌కుమార్‌ వారసురాలిగా నటిగా తెరంగేట్రం చేసి, అతి తక్కువ చిత్రాలతోనే వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ తన సత్తా చాటుతోంది. గతంలో ఈమెకి, తెలుగు కుర్రాడు, తమిళ మాస్‌ హీరో విశాల్‌తో ప్రేమ వ్యవహారం నడిచిందని, దాని మూలంగానే విశాల్‌కి, శరత్‌కుమార్‌-రాధిక దంపతులు బద్ద శత్రువులుగా మారారని అంటారు. నడిగర్‌ సంఘంతో పాటు నిర్మాతల మండలిలో కూడా విశాల్‌.. శరత్‌కుమార్‌ని టార్గెట్‌ చేసి ఆయనపై పైచేయి సాధించాడు. నడిగర్‌ సంఘం కొత్త భవనం, షాపింగ్‌ కాంప్లెక్స్‌తోపాటు అక్కడ నెలకొల్పో కళ్యాణమండపంలో తొలి పెళ్లి తానే చేసుకుంటానని విశాల్‌ అన్నాడు. దాంతో విశాల్‌-వరలక్ష్మిల వివాహం ఖాయమైందని కోలీవుడ్‌ మీడియా కోడై కూసింది. కానీ ఇటీవల మాత్రం వారు తాము కేవలం ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకునే మంచి స్నేహితులం మాత్రమేనని చెబుతున్నారు. 

Advertisement
CJ Advs

ఇక విశాల్‌ నటించిన ‘పందెంకోడి2’లో వరలక్ష్మి ప్రతినాయిక ఛాయలున్న పాత్రను పోషించి, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తాజాగా అతి తక్కువ వ్యవధిలోనే ఆమె మురుగదాస్‌ వంటి గ్రేట్‌ డైరెక్టర్‌, విజయ్‌ వంటి ఎవర్‌గ్రీన్‌ స్టార్‌తో కలిసి ‘సర్కార్‌’లో నటించింది. ఈ సందర్భంగా ఆమె ‘ఎవరినైనా లవ్‌ చేయాలనే ఫీలింగ్‌ ఇప్పటివరకు మీకు కలిగిందా? లేదా?’ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. లవ్‌ అనే ఫీలింగ్‌ వచ్చింది.. పోయింది కూడా.. ఒక మగాడు పెళ్లి తర్వాత తన జాబ్‌ని వదులుకోవడానికి సిద్దంగా లేనప్పుడు నేను మాత్రం పెళ్లి తర్వాత నా జాబ్‌ని ఎందుకు వదిలేయాలి? నా అభిప్రాయాలకు, ఆలోచనలకు విలువ ఇచ్చే వ్యక్తే నా జీవితంలోకి వస్తాడు. లేదంటే ఇలాగే ఒంటరిగా ఉండి పోతాను. అవతలి వ్యక్తిపై ప్రేమ అనేది లేకుండా.. ఇంట్లో వాళ్ల కోసమే.. సమాజం కోసమే పెళ్లి చేసుకోవడం నాకు నచ్చదు..అని చెప్పింది. 

ఈమె మాటలు నేటి యువతుల అలోచనా ధోరణికి అద్దం పడుతున్నాయి. అన్నట్లు చాలా కాలం కిందట విశాల్‌ పెళ్లి తర్వాత వరలక్ష్మి కేవలం భార్యగా, కోడలిగా మాత్రమే ఉండాలని కోరడంతోనే వారి మద్య విబేధాలు వచ్చాయనే వ్యాఖ్యలకు ఇది మరింత బలం చేకూరుస్తోంది. 

Varalakshmi Sarath Kumar about Love with Vishal:

Varalakshmi Sarathkumar Latest Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs