Advertisement
Google Ads BL

‘వినయ విధేయ రామ’ లుక్: ఊర మాసే..!!


రంగస్థలం సినిమాతో నటుడిగా రామ్ చరణ్ కెరీర్ లోనే అదరగొట్టే హిట్ అందుకున్నాడు. రంగస్థలం లాంటి చిత్రంలో నటించిన రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నాడు. మరి బోయపాటి మార్క్ యాక్షన్ ఎలా ఉంటుందో బోయపాటి గత సినిమాల్లోనే చూసాం. హీరోలో హిరోయిజాన్ని బోయపాటి కన్నా ఎక్కువగా ఎవరు చూపించలేరేమో అన్నట్టుగా ఉంటాయి ఆయన సినిమాలు. హీరోలను మాస్‌గా.. కాదు కాదు ఊర మాస్ గా చూపిస్తాడు. మరి తమ హీరో మాస్ అండ్ యాక్షన్ హీరోగా చూడాలనే అభిమానుల కోరికలు ఇలాంటి డైరెక్టర్స్ తోనే తీరతాయి.

Advertisement
CJ Advs

ఇక రామ్ చరణ్ తో బోయపాటి సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కాస్త లేట్ గానే ఈ సినిమా టైటిల్ అండ్ లుక్ ని విడుదల చేసింది RC12 బృందం. సినిమా సంక్రాంతికి విడుదలవుతుందని... దీపావళి కానుకగా రామ్ చరణ్ బోయపాటి మూవీ లుక్ వస్తుంది అనగానే మెగా అభిమానుల ఆనందానికి అవధులే లేవు. మరి ముందు నుండి ప్రచారం జరిగినట్టుగానే రామ్ చరణ్ కొత్త సినిమా టైటిల్ ని ‘వినయ విధేయ రామ’గా పెట్టిన బోయపాటి.. రామ్ చరణ్ ని ఊర మాస్ లుక్ లో దింపేసాడు. మరి బోయపాటి మార్క్ మాస్ ఈ లుక్ లోనే తెలిసిపోతుంది . 

బోయపాటి ఈసారి చరణ్‌తో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా తీస్తున్నాడని అన్నారు. కానీ... బోయపాటి మార్క్ యాక్షన్ ఎక్కడా మిస్ కాకుండానే ‘వినయ విధేయ రామ’ లో రామ్ చరణ్ లుక్ ఉంది. చరణ్‌లోని  డైనమిక్ ఎలిమెంట్‌ని ఎలివేట్ చేసేదిగా వున్న ఈ లుక్ మెగా ఫాన్స్ ని ఉర్రూతలూగిస్తుంది. మరి టైటిల్ సాఫ్ట్‌గా ‘వినయ విధేయ రామ’ అని పెట్టినప్పటికీ... చరణ్ లుక్ చూసిన ఎవ్వరైనా ఈ సినిమా పక్కా యాక్షన్ మూవీనే అంటారు. ఇక  ఈసినిమాలో కియారా అద్వానీ.. రామ్ చరణ్ కి జోడిగా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11 న విడుదలవుతుండగా... ఈ సినిమా టీజర్ నవంబర్ 9న విడుదల చేస్తున్నట్లుగా నిర్మాత ప్రకటించిన విషయం తెలిసిందే.

Vinaya Vidheya Rama First Look Released:

Vinaya Vidheya Rama First Look Report
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs