రాజమౌళి మల్టీస్టారర్ ముచ్చట్లు ఊపందుకున్నాయి. నిన్నటివరకు రోజుకి ఒకటి రెండు రాజమౌళి #RRR గురించి వినబడితే ఇప్పుడు రోజంతా అవే వినబడుతున్నాయి. రాజమౌళి సెన్సేషనల్ మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టడం అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటించడం వంటి ఆసక్తికర అంశాలే కాదు.. #RRR కథ ఇదేనంటూ రోజుకో గాసిప్ సోషల్ మీడియాని ఊపేసింది. ఇక ఈ నెల 11 న పూజ కార్యక్రమాలతో ప్రారంభోత్సవం చేసుకోనున్న RRR లో హీరోయిన్స్ ని కూడా రాజమౌళి సెట్ చేసి మూవీ ఓపెనింగ్ రోజే ప్రకటిస్తాడంటున్నారు. మరోవైపు ఈ గ్రాండ్ ఓపెనింగ్ కి డార్లింగ్ ప్రభాస్ కానీ.. ఏపీ సీఎం చంద్రబాబు కానీ వస్తారంటూ ప్రచారం జరుగుతుంది.
అయితే మూవీ ఓపెనింగ్ రోజు ఎనౌన్స్ చెయ్యబోయే హీరోయిన్స్ విషయంలో రాజామౌళి ప్లాన్ ఎలా ఉంటుందో అనే అంశం ఇప్పటి అందరినీ వద్దన్నా ఆలోచించేలా చేస్తుంది. కనీసం చరణ్, ఎన్టీఆర్ పక్కన నటించే హీరోయిన్స్ ను ఊహించడానికి ఊహకి కూడా అందడం లేదు. అయితే రాజమౌళి ఎనౌన్స్ చెయ్యబోయే హీరోయిన్ సాదా సీదా హీరోయిన్స్ కాదని.. వాళ్ళు వరల్డ్ వైడ్ గా పేరున్న హీరోయిన్స్ అనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ ని కూడా ఇండియా వైడ్ గా గ్రాండ్ గా దింపబోతున్నాడట. అయితే ఆ హీరోయిన్స్ మరెవరో కాదని.. బాలీవుడ్ నుండి దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలను చరణ్ అండ్ ఎన్టీఆర్ లకు జోడిగా సెలెక్ట్ చేసి జక్కన్న సస్పెన్స్ లో పెట్టాడని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రియాంక చోప్రా, దీపికా కాల్షీట్లు ఇచ్చేశారని, పెద్దగా ప్రాధాన్యం లేని మూడో హీరోయిన్‌గా ఒక హాలీవుడ్ గ్లామర్ స్టార్‌ని సెలక్ట్ చేశారని చెబుతున్నారు.
మరి ఈ వార్త నిజామా.. కాదా.. అనేది మాత్రం క్లారిటీ లేదు. ఎందుకంటే.. రాజమౌళి ఒకవేళ దీపికాని ప్రియాంకని తీసుకొస్తే వారేమన్న ఊరికే ఉన్నారా... చాల కాస్ట్లీ. కాస్ట్లీ అయితే నిర్మాతలు భరిస్తారు అది ఓకే. కానీ దీపికా పదుకొనె, ప్రియాంక చోప్రాలు ఈ నెలలోనే పెళ్లి పీటలేక్కబోతున్నారు. మరి పెళ్లి తర్వాత హనీమూన్ గట్రా ఉంటాయి. అలాంటప్పుడు రాజమౌళికి కాల్షీట్స్ ఇచ్చేందుకు వీరు రెడీ అవుతారా... అందులోను ప్రియాంక చోప్రా.. సల్మాన్ ఖాన్ భరత్ మూవీ నుండి రెమ్యునరేషన్ చాలకో... పెళ్లి విషయమై బయటికొచ్చేసి ముంబై నుండి అమెరికా ఫ్లైట్ ఎక్కేసింది. ఎందుకంటే అమెరికాలోనే ప్రియాంక నిక్ జోనస్ ని వివాహమాడనుంది. ఇక దీపికా - రణ్వీర్ ల వివాహం కూడా ఈనెల 14, 15 తేదీల్లో జరగబోతున్న విషయం తెలిసిందే.