Advertisement
Google Ads BL

మహేష్, విజయ్, ప్రభాస్.. ఎవరితో సుక్కు..??


తెలుగు సినీ రంగంలోని ప్రస్తుత దర్శకుల్లో మోస్ట్‌ ఇంటిలిజెంట్‌ డైరెక్టర్‌గా సుకుమార్‌ పేరును చెప్పుకోవాలి. మొదటి చిత్రం ‘ఆర్య’ నుంచి ఆయన చేసిన చిత్రాలన్నీ విభిన్న కాన్సెప్ట్‌లు కావడమే దానికి నిదర్శనం. అయితే సామాన్యులకు అందని రీతిలో హైస్టాండర్డ్స్‌లో సుక్కు ఆలోచనలు ఉంటాయనే అపవాదు ఉంది. ఇందులో ఎంతో నిజం కూడా ఉంది. కానీ అలాంటి విభిన్న చిత్రాలతోనే ఆయన అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లకు బిగ్గెస్ట్‌ హిట్స్‌ అందించాడు. ఆయన సామాన్యులకు అర్ధంకాని లెక్కల మాస్టార్‌ అనే విమర్శలను ‘రంగస్థలం’ వంటి అద్భుతమైన, వైవిధ్యంతో పాటు అందరినీ ఆకట్టుకునే కథ, కథనాల ద్వారా తనలో వచ్చిన మార్పుని తెలిపాడు. 

Advertisement
CJ Advs

ఇక ఇంతటి పెద్ద బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఆయన చేయబోయే తదుపరి చిత్రంపై కూడా బోలెడు అంచనాలున్నాయి. గతంలో విమర్శకుల ప్రశంసలు పొందిన కూడా కమర్షియల్‌గా వర్కౌట్‌కాని చిత్రం ‘1’ (నేనొక్కడినే) ని మహేష్‌బాబుకి అందించాడు. ఆ లోటును వడ్దీతో సహా తీర్చేయాలని సుక్కు ఎంతో కసితో, పట్టుదలతో ఉన్నాడట. మరోవైపు మహేష్‌ ప్రస్తుతం దిల్‌రాజు-అశ్వనీదత్‌ల నిర్మాణ భాగస్వామ్యంలో వంశీపైడిపల్లితో చేస్తోన్న ప్రతిష్టాత్మక 25 చిత్రంగా ‘మహర్షి’ చేస్తున్నాడు. దీని అనంతరం ఆయన సుక్కుతో మరో చిత్రం చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ కూడా ఇచ్చాడు. మహేష్‌తో చిత్రం కోసం సుక్కు ఓ తెలంగాణ నేపధ్యంలోని కథను తయారు చేసి వినిపించాడట. కానీ ఆ స్టోరీ తనకు నప్పదని మహేష్‌ చెప్పడంతో ఆయన మరో కథ కోసం కృషి చేస్తున్నాడు. 

ఇదే సందర్భంగా మహేష్‌ తనకి సూట్‌ అవ్వదని చెప్పిన తెలంగాణ నేపధ్యంలోని కథ తెలంగాణ స్టార్‌ అయిన విజయ్‌దేవరకొండకి బాగా సూట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో సుక్కు ఈ స్టోరీని విజయ్‌కి వినిపించడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంది. గతంలో సుక్కు.. రామ్‌, నాగచైతన్య వంటి యంగ్‌హీరోలతో కూడా పనిచేశాడు. ఆ లెక్కన విజయ్‌ చిత్రం ఓకే అయితే అది విజయ్‌ కెరీర్‌కి ఎంతో హెల్ప్‌ అవుతుందనే చెప్పాలి. వీరితో పాటు సుకుమార్‌.. ప్రభాస్‌ కోసం కూడా ఓ స్టోరీని సిద్దం చేస్తున్నాడనేది ఫిల్మ్‌నగర్‌ సమాచారం.

Confusion Continues on Sukku Next Film:

Who is Sukku’s next Hero
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs